Friday, February 28

CURRENT AFFAIRS – JUL 25

తెలంగాణ
01) రాష్ట్రంలో చెరువుల పునరుద్దరణ కోసం ప్రభుత్వ అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఏ సంస్థ నుంచి ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖకు ఆహ్వానం అందింది.
జ: థర్డ్ వరల్డ్ ఇరిగేషన్ ఫోరం (WIF3)
02) శానిటరీ న్యాపికిన్స్ ఉచితంగా అందించేందుకు కొత్తగా హైదరాబాద్ ప్రారంభించనున్న కార్యక్రమం పేరేంటి ?
జ: షీ నీడ్
03) రాష్ట్రంలో ఏ ప్రముఖ దేవాలయంలో నిత్యపూజకు తెలంగాణ గిరిజన సహకార సంస్థ నుంచి ప్రతి నెలా 50 కిలోల తేనెను సరఫరా చేయనున్నారు ?
జ: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
04) IAS అధికారి బుర్రా వెంకటేశం ఇంగ్లీషులో రాసిన ఏ పుస్తకం అమెజాన్ అమ్మకాల్లో ముందంజలో ఉంది ?
జ: సెల్ఫీ ఆఫ్ సక్సెస్

జాతీయం
05) ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారిని కూడా ఉగ్రవాదులుగా గుర్తించే ఏ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది.
జ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ బిల్లు) 2019
06) సుప్రీంకోర్టు తీర్పులు తెలుగు సహా ఎన్ని ప్రాంతీయ భాషల్లో అనువాదం చేస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్ సభలో తెలిపారు ?
జ: 9 భాషల్లో
07) కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎవరు నియమితులు అవుతున్నారు ?
జ: అజయ్ కుమార్ భల్లా (ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు )
08) గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2019లో భారత్ కు ఎన్నో ర్యాంక్ దక్కింది ?
జ: 52 వ ర్యాంక్
09) సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ మొదటి సదస్సు 2019 ఆగస్టు 9న ఎక్కడ జరుగుతోంది ?
జ: హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో
10) దేశీయ సాంకేతికతతో తయారు చేసిన చేతక్ హెలికాప్టర్లు భారత నౌకాదళానికి చేరాయి. వీటిని ఏ సంస్థ తయారుచేసింది ?
జ: హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ( HAL)
11) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ 2లోని ల్యాండర్ 2019 సెప్టెంబర్ 7న చంద్రుడిపైకి సురక్షితంగా దిగనుంది. ఆ ల్యాండర్ పేరేంటి ?
జ: విక్రమ్
12) సెప్టెంబర్ 7న చంద్రుడిపైకి ల్యాండర్ విక్రమ్ దిగే చారిత్రక ఘడియలను ఇస్రో కమాండ్ సెంటర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఏ ఛానెల్ నిర్ణయించింది ?
జ: నేషనల్ జియోగ్రాఫికల్ ఛానెల్
13) ఇతర క్రీడల్లో ఆటగాళ్ళని ప్రోత్సహించడానికి ఏడాదికి ఎన్ని కోట్లు ఖర్చుపెట్టాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయించాడు ?
జ: రూ.2కోట్లు ( విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ద్వారా )

అంతర్జాతీయం
14) పాకిస్తాన్ లో 40 వేల మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని ప్రకటించినది ఎవరు ?
జ: ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
15) అమెరికాలోని మేరీలాండ్ లో ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్న సూపర్ లైట్ వెయిట్ విభాగంలో ప్రత్యర్థి ఆటగాడి పంచ్ తో ప్రాణాలు కోల్పోయిన రష్యన్ బాక్సర్ ఎవరు ?
జ: మాక్సిబ్ డడ్ షెవ్
16) ఇటీవల ప్రపంచకప్ గెలుచుకున్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు అనూహ్యంగా ఏ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 85 పరుగులకే ఆలౌట్ అయింది ?
జ: ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో (లార్డ్స్ మైదానం)
17) వ్యక్తిగత సమాచార గోప్యత నిబంధనలు ఉల్లంఘించినందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఎంత మొత్తం భారీ జరిమానా విధించింది ?
జ: రూ.35 వేల కోట్లు ( 5 బిలియన్ డాలర్లు )

100 రోజుల మాక్ టెస్టులు వచ్చే సోమవారం జులై 30 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ లాంగ్ టర్మ్ కోర్సుతో నోటిఫికేషన్లు పడకముందే సబ్జెక్ట్ లపై గ్రిప్ పెంచుకోవచ్చు. వెంటనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి... పూర్తి వివరాలకు ఈ కింది లింకులో ఉన్నాయి.
http://telanganaexams.com/mock-tests-2/