Sunday, March 24

CURRENT AFFAIRS – JAN 02

రాష్ట్రీయం
01) తెలంగాణ హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
జ: జస్టిస్ రాధాకృష్ణన్
02) తెలంగాణ హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ప్రమాణం చేశారు ?
జ: 13 మంది
03) రాష్ట్రంలో ఎన్ని పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ?
జ: 12,732
04) రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి ?
జ: జనవరి 21, 25, 30 తేదీల్లో
05) పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి వ్యయ పరిమితి ఎంత ఉంటుంది ?
జ: 5వేల జనాభా దాటితో : రూ.2.50 లక్షలు
5 వేల లోపు : రూ.1.50 లక్షలు
06) సర్పంచ్ అభ్యర్థి, వార్డు సభ్యులు డిపాజిట్ మొత్తంగా ఎంత చెల్లించాలి ?
జ: సర్పంచ్ (జనరల్ ) - 2వేలు, sc/st/bc రూ.1000
వార్డు మెంబర్ (జనరల్) 500, sc/st/bc రూ.250

జాతీయం
07) LIC తాత్కాలిక ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: హేమంత్ భార్గవ
08) దక్షిణ మధ్య రైల్వే ఇంఛార్జి గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: ఆర్. కె. కుల్ శ్రేష్ఠ
09) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: పి.కె.సింగ్
10) జనవరి 1 నుంచి స్కూళ్ళల్లో టీచర్లు హాజరు తీసుకునేటప్పుడు ఎస్ సార్ కి బదులు జై హింద్ అనీ... లేదా జై భారత్ అని హాజరు పలకాలని ఆదేశాలు ఏ రాష్ట్రంలో జారీ అయ్యాయి ?
జ: గుజరాత్

అంతర్జాతీయం
11) సౌర కుటుంబంలో అత్యంత సుదూర, పురాతన ఖగోళ వస్తువు అయిన అల్టిమా తూలీ దగ్గరకు వెళ్లిన నాసాకి చెందిన వ్యోమ నౌక ఏది ?
జ: న్యూ హొరైజన్స్ః
12) 2018లో ఇంటర్నెట్ లో జనం ఎక్కువగా వెతికిన పదాలు ఏవి ?
జ: టాక్సిక్, నోమోఫోబియా, మిస్ ఇన్ఫర్మేషన్, సింగిల్-యూజ్, జస్టిస్

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/