Thursday, January 23

CURRENT AFFAIRS – JAN 9

తెలంగాణ
01) రాష్ట్రంలో తాజాగా ఏ ప్రాజెక్టుకి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది ?
జ: సీతారామ ప్రాజెక్ట్
02) ప్రస్తుత శాసనసభా కార్యదర్శి ఎవరు ?
జ: నర్సింహాచార్యులు
03) తెలంగాణ ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిన జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఏది ?
జ: టెటామస్
04) రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ( సిద్ధిపేట )

జాతీయం
05) న్యూ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైన నార్వే ప్రధాని ఎవరు ?
జ: ఇర్నా సోల్ బర్గ్
06) అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్ల కల్పించే బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి ఎవరు ?
జ: థావర్ చంద్ గహ్లోత్
07) మళ్ళీ సీబీఐ డైరక్టర్ గా ఎవరిని నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ?
జ: అలోక్ వర్మ
08) పైరసీని అడ్డుకునేందుకు సినిమాటోగ్రాఫ్ చట్టం 1952కి సవరణ చేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పైరసీకి పాల్పడితే ఎంత శిక్ష విధించేలా కొత్త నిబంధనల చేర్చబోతున్నారు ?
జ: 3యేళ్ళు జైలు లేదా 10 లక్షల జరిమానా లేదా
09) దేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఎవరి ఆధ్వర్యంలో అత్యున్నతస్థాయి ఐదుగురు సభ్యుల కమిటీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించింది ?
జ: ఆధార్ రూపకర్త నందన్ నీలేకని
10) యాంటీ - ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, లాంచర్స్ భారత సైన్యానికి సరఫరా చేసేందుకు రూ.760 కోట్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్న హైదరాబాద్ కి చెందిన సంస్థ ఏది ?
జ: బీడీఎల్ ( భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ) (భానూర్ లో ఉంది)
11) 2019 మార్చి 23 నుంచి మొదలయ్యే ఐండియన్ ప్రీమియర్ లీగ్ 2019 టోర్నమెంట్స్ పూర్తిగా ఏ దేశంలో జరుగుతాయని BCCI ప్రకటించింది ?
జ: భారత్ లోనే

అంతర్జాతీయం
12) అంతర్జాతీయ ద్రవ్య నిధి ( IMF) ప్రధాన ఆర్థికవేత్తగా నియమితులైన ప్రముఖ భారతీయ అమెరికన్ అర్థశాస్త్రవేత్త ఎవరు ?
జ: గీతా గోపీనాథ్
(నోట్: తొలి మహిళగా ఆమె ఈ ఘనత సాధించారు )
13) ట్వీట్టర్ ద్వారా జరిగిన ఎన్నికల్లో పాకిస్తాన్ జాతీయ స్వీటుగా దేన్ని గుర్తించారు ?
జ: గులాబ్ జామూన్

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/