Thursday, January 23

CURRENT AFFAIRS – JAN 8

తెలంగాణ
01) తెలంగాణలో పార్లమెంటరీ కార్యదర్శులను ఏమని పిలవాలని మంత్రిమండలి నిర్ణయించింది ?
జ: పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులు
02) శాసనసభలో ఆంగ్లో ఇండియన్ సభ్యుడిగా మళ్లీ ఎవరి పేరును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాకి సిఫార్సు చేసింది ?
జ: స్టీఫెన్ సన్
03) తెలంగాణలో 334 కిమీ మేర రెండు జాతీయ రహదారులను కేంద్రం గుర్తించింది. అవి ఏంటి ?
జ: 1) సంగారెడ్డి - నర్సాపూర్ - తూప్రాన్- గజ్వేల్- జగ్ దేవ్ పూర్-భువనగిరి- చౌటుప్పల్ ( దాదాపు 154 కిమీ)
2) చౌటుప్పల్ - షాద్ నగర్ - కంది ( 180కిమీ)
04) వెట్టి చాకిరీతో మగ్గుతున్న బాల కార్మికులకు విముక్తి కల్పించేందుకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం మళ్లీ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు ?
జ: 2015 నుంచి ప్రతి యేటా జనవరి, జులై నెలల్లో
05) దళితుల్లో నాయకత్వాన్ని పెంపొందించడానికి ఉద్దేశించిన దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( DICCI) తెలంగాణ విభాగం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: కత్తరపాక రవి కుమార్
(నోట్ : డిక్కీ వ్యవస్థాపకుడు మిలింద్ కాంబ్లే )
06) రాష్ట్రంలోని ఎన్ని మున్సిపాలిటీల్లో ఆన్ లైన్ ద్వారానే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేలా వ్యవస్థను ప్రభుత్వం ప్రారంభించింది ?
జ: 68 మున్సిపాలిటీల్లో
07) సికింద్రాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో నాలుగో అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ఎప్పటి నుంచి జరుగుతుంది ?
జ: 2019 జనవరి 13 నుంచి 15 వరకూ
08) మాతా శిశు సంరక్షణలో లక్ష్యాలు చేరుకున్నందుకు రాష్ట్రానికి చెందిన ఏ అంగన్ వాడీ కార్యకర్తలకు జాతీయ స్థాయి పురస్కారాలు దక్కాయి ?
జ: ఖమ్మం జిల్లా ఏన్కూరు - బి.సుశీల
వికారాబాద్ కు చెందిన జె.విజయలక్ష్మి

జాతీయం
09) అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లకు లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ కోటా అమల్లోకి వస్తే రిజర్వేషన్లు ఎంతకు చేరతాయి ?
జ: 59.5శాతం (గతంలో 49.5శాతం )
10) ప్రస్తుతం విద్య, ఉద్యోగాల్లో ఎవరెవరికి ఎంత శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ?
జ: ఓబీసీ - 27శాతం, ఎస్టీ - 7.5శాతం, ఎస్సీ - 15 శాతం = మొత్తం 49.5శాతం
11) అత్యధికంగా రిజర్వేషన్లు కలిగిన రాష్ట్రం ఏది ?
జ: తమిళనాడు 69శాతం
12) ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం ల్లో ఎస్టీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఉన్నాయి ?
జ: 80శాతం
13) 2019 రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొనే నేషనల్ కేడెట్ కోర్ ( NCC) శిబిరాన్ని న్యూఢిల్లీలో ఎవరు ప్రారంభించారు ?
జ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
14) పౌరసత్వ ముసాయిదా (సవరణ) బిల్లు-2018 కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టమైతే ఏయే దేశాలకు చెందిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించడానికి వీలవుతుంది ?
జ: పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్
15) పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ లో వివక్షకు గురై భారత్ ను ఆశ్రయించిన మైనార్టీలకు పౌరసత్వం ఇవ్వాలని నివేదిక ఇచ్చిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కి ఎవరు అధ్యక్షత వహించారు ?
జ: బీజేపీ ఎంపీ రాజేంద్ర అగ్రవాల్
16) పుష్కరాలు లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున వచ్చే జన సమూహాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు కృత్రిమ మేథ ద్వారా సాధ్యమని చెప్పిన ప్రొఫెసర్ ఎవరు ?
జ: ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ రాజన్
17) ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ విజయం సొంతం చేసుకుంది. ఎన్నేళ్ళ తర్వాత ఈ అవకాశం దక్కింది ?
జ: 71 యేళ్ళ తర్వాత
18) ఆస్ట్రేలియా లో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా జట్టు ఏది ?
జ: భారత్
19)బంధన్ బ్యాంక్ లో విలీనం అవుతున్న దిగ్గజ తనఖా సంస్థ HDFC ప్రమోటర్ గా ఉన్న గృహ రుణ సంస్థ ఏది ?
జ: గృహ్ ఫైనాన్స్

అంతర్జాతీయం
20) 2019 ఫిబ్రవరి 1నుంచి వైదొలుగుతున్న ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ?
జ: జిమ్ యాంగ్ కిమ్
(నోట్: ఆరేళ్ళుగా ఈ పదవిలో ఉన్నారు. ఆయన పదవీ కాలం 2022 వరకూ ఉంది )
21) బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం చేశారు. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు ఎవరు ?
జ: మహమ్మద్ అబ్దుల్
22) ఇరాన్ లోని కీలకమైన చాబహార్ పోర్ట్ నిర్వహణ బాధ్యతలను ఏ దేశానికి అప్పగించారు ?
జ: భారత్ కి

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/