Thursday, January 23

CURRENT AFFAIRS – JAN 5

తెలంగాణ
01) జలవనరులు, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల నిర్వహణలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ ఏటా అందించే ఎక్స్ లెన్స్ అవార్డు దేనికి దక్కింది ?
జ: మిషన్ భగరీధ
02) తృణ ధాన్యాల సాగుని ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఎన్ని మండలాలను గుర్తించారు ?
జ: 36 మండలాలు
(నోట్: వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కుమ్రం భీమ్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని మండలాలు )
03) తృణ ధాన్యాలు సాగు చేసే రైతులకు హెక్టారుకి ఎంత మొత్తం ప్రోత్సాహక రాయితీ అందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది ?
జ: రూ.6 వేలు
04) హుస్సేన్ సాగర్ తీరాన సందర్శకుల కోసం త్వరలో జలంతర్గామి, యుద్ధ విమానాన్ని హైదరాబాద్ కి తీసుకు రావాలని భావిస్తున్నారు. ఆ యుద్ధ విమానం పేరేంటి?
జ: తుపోలెవ్ టీయూ-142 ఎం
05) చెకుముకి వైజ్ఞానిక వేడుకలు ఎక్కడ జరుగుతున్నాయి ?
జ: వరంగల్ లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ (NIT) లో
06) వ్యభిచారం నుంచి విముక్తికి ఎంబీసీ కార్పోరేషన్ ఒక్కో కుటుంబానికి ఉపాధి పథకం కింద ఎంత మొత్తం ఇవ్వాలని నిర్ణయించింది ?
జ: రూ. 2లక్షలు
07) కరీంనగర్ సాహితీ గౌతమి ఏటా రాష్ట్ర స్థాయిలో అందిస్తున్న సినారె కవితా పురస్కారం 2018కి ఎవరు ఎంపికయ్యారు ?
జ: తప్తస్పృహ గ్రంథ రచయిత మౌనశ్రీ మల్లిక్

జాతీయం
08) పంజాబ్ లోని జలంధర్ లో జరుగుతున్న 106 భారత సైన్స్ కాంగ్రెస్ ను ఎవరు ప్రారంభించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
09) దేశాభివృద్ధిలో పరిశోధనా రంగం ప్రాధాన్యతను చాటి చెప్పేలా ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన కొత్త నినాదం ఏది ?
జ: జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ .. జై అనుసంధాన్
10) ప్రధాని నరేంద్రమోడీ జీవితంపై PM నరేంద్రమోడీ పేరుతో మూవీ రానుంది. ఇందులో మోడీ పాత్రలో నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తారు. దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు ?
జ: ఓమంగ్ కుమార్
(నోట్: గతంలో సరభ్ జీత్, మేరీ కోమ్ సినిమాలకి ఈయన దర్శకత్వం వహించారు )
11) వార్తా పత్రికలు, పునర్వినియోగ ప్లాస్టిక్ లో ఆహార పదార్థాలను ఎప్పటి నుంచి ప్యాకింగ్ చేయడాన్ని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది ?
జ: 2019 జులై 1 నుంచి
12) 2019లో దేశీయ ఐటీ వ్యయాలు ఎంతశాతం వృద్ధితో రూ.2,59,762 కోట్లకు చేరతాయని కోయస్ ఏజ్ కన్సల్టింగ్ నివేదిక పేర్కొంది ?
జ: 11.9శాతం వృద్ధి
13) 2019 సంవత్సరంలో ఎన్ని అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తామని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ వెల్లడించారు ?
జ: 32 ప్రయోగాలు
14) దేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నఇటలీకి చెందిన స్వచ్ఛంద సంస్థ కేర్ అండ్ షేర్ ఇటాలియా - బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ

అంతర్జాతీయం
15) అమెరికాకి చెందిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ తరహాలో శక్తిమంతమైన భారీ బాంబును చైనా తయారు చేస్తోంది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అసలు పేరేంటి ?
జ: మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్
16) చంద్రుడికి రెండో పక్కకు దిగిన చైనా వ్యోమ నౌక పేరేంటి ?
జ: చాంగే - 4

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/