Wednesday, September 18

CURRENT AFFAIRS – JAN 13

తెలంగాణ
01) రాష్ట్రంలో పండుతున్న మామిడి కాయలను ఏ బ్రాండ్ తో విదేశాలకు ఎగుమతి చేయాలని రాష్ట్ర ఉద్యాన శాఖ నిర్ణయించింది ?
జ: కాకతీయ బ్రాండ్
02) కాయలను మాగబెట్టి విదేశాలకు పంపేందుకు అనువుగా ఉండేలా ఏ యూనివర్సిటీలో ప్యాక్ హౌస్ ను ఏర్పాటు చేస్తున్నారు ?
జ: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో
03) ఏ ప్రాంతాల్లో ఏయే పంటలు పండించడానికి అనువుగా ఉన్నాయో గుర్తించిం పంటల కాలనీలను ఎప్పటి నుంచి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: వానాకాలం నుంచి (ఖరీఫ్ సీజన్ )
04) పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు రూపొందించిన టాకింగ్ బుక్స్ ని మరో 500 పాఠశాలలకు అందించనున్నారు. ఏ సంస్థ వీటిని అందిస్తోంది ?
జ: యూనిసెఫ్
05) అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు ?
జ: కొండి మల్లారెడ్డి ( సిద్ధిపేట జిల్లాకి చెందిన కవి, రచయిత)

జాతీయం
06) జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటు ఆమోదించిన బిల్లుకి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇది ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టంగా రూపాంతరం చెందింది ?
జ: 103వ రాజ్యాంగ సవరణ
07) రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరో మూడు బిల్లులపై ఆర్డినెన్స్ జారీ చేశారు. అవి ఏంటి ?
జ: 1) ముమ్మారు తలాక్ 2) భారత వైద్య మండలి సవరణ బిల్లు - 2018 (3) కంపెనీల సవరణ బిల్లు - 2019
08) భారత ప్రభుత్వం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకానికి ఏ సంస్థ నుంచి ప్రశంసలు లభించాయి
జ: ప్రపంచ మేధో సంపద సంస్థ ( WIPO) ( దీని డైరక్టర్ జనరల్ ఫ్రాన్సిస్ గర్రీ)
09) ప్రపంచంలోనే ఎత్తయిన శివలింగంగా (112.2 అడుగుల ఎత్తు) ఎక్కడ నిర్మించిన లింగానికి గుర్తింపు వచ్చింది ?
జ: తమిళనాడు -కేరళ సరిహద్దుల్లో ఉదయకుళంగర నిర్మించారు
(నోట్: రూ.10కోట్ల రూపాయల ఖర్చు)
10) హరియాణా రాష్ట్రంలోని ఏ గ్రామంలో 4,500 ఏళ్ళ క్రితం నాటి హరప్పా సమాధుల్లో ఒక పురుషుడు, ఒక మహిళని ఉమ్మడిగా సమాధి చేసిన అస్తిపంజరాలను గుర్తించారు ?
జ: రాఖీఘరీ
11) రాఖీఘరీలో ఏయే దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు హరప్పా సమాధుల్లో తవ్వకాలు జరిపారు ?
జ: భారత్, దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు
12) హరప్పా, మొహంజదారో సమాధుల్లో ఎక్కడా ఆడంబరాలు కనిపించవు. పశ్చిమాసియా రాజుల లాగా అంత్యక్రియలు వాళ్ళు ఆడంబరాలు జరుపుకోరని ‘Early Indians, The Story of our Ancestors and where we came from' పుస్తక రచయిత ఎవరు ?
జ: టోనీ జోసెఫ్
13) యెస్ బ్యాంక్ తాత్కాలిక ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: బ్రహ్మదత్

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/