Thursday, February 27

CURRENT AFFAIRS – JAN 12

తెలంగాణ
01) తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్
02) ఇప్పటిదాకా తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ఎక్కడికి బదిలీ అయ్యారు ?
జ: కలకత్తా హైకోర్టుకి
03) దేశంలో గొర్రెల మాంసం వినియోగంలో మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ. రాష్ట్రంలో వ్యక్తి ఏడాది సరాసరి వినియోగం ఎంత ?
జ: 7.5కిలోలు
04) వచ్చే నెల నుంచి చెవి, ముక్కు, గొంతు పరీక్షలకు ఏమని పేర్లు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు ?
జ: శ్రవణం, దంతక్రాంతి
05) వినికిడి లోపం ఉన్న వారికి ఎంత విలువైన యంత్రాలను ఉచితంగా సరఫరా చేయనున్నారు ?
జ: రూ.3 వేలు
06) కార్పోరేట్ సామాజిక బాధ్యతలో అత్యుత్తమ సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా CSR అవార్డు -2018 కి ఎంపికైన సంస్థ ఏది ?
జ: శంషాబాద్ ఎయిర్ పోర్ట్
07) 2019 జనవరి 11నాడు ఆదివాసీల అభివృద్ధికి కృషి చేసిన ఆంత్రోపాలజీ ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, ఆయన సతీమణి బెట్టి ఎలిజబెత్ 32వ వర్ధంతిని కుమ్రం భీం జిల్లాలో జరుపుకున్నారు. ఈయన ఏ దేశానికి చెందిన వారు ?
జ: బ్రిటన్

జాతీయం
08) సీబీఐ మాజీ డైరక్టర్ అలోక్ వర్మ రాజీనామా చేశారు. ఆయన్ని ఇటీవల ప్రభుత్వం ఏ శాఖకు బదిలీ చేసింది ?
జ: అగ్నిమాపక సేవలు, పౌర, రక్షణ హోంగార్డుల విభాగం
09) ముందు ప్రకటించినట్టు చంద్రయాన్ ను జనవరి-ఫిబ్రవరిలో కాకుండా ఏ నెలలో చేపడుతున్నట్టు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు ?
జ: ఏప్రిల్ నెలలో (ప్రాజెక్టు వ్యవయం రూ.800 కోట్లు)
10) మానవ సహిత అంతరిక్ష ప్రయోగయం గగన్ యాన్ ప్రాజెక్ట్ ను ఎప్పుడు ప్రారంభిస్తున్నట్టు ఇస్రో ఛైర్మన్ తెలిపారు ?
జ: డిసెంబర్ 2021లో
11) భారత్ కు ఇచ్చే నిధుల సాయంలో 2019లో ఎంతకు పెంచుతున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటించింది ?
జ: 4.5 బిలియన్ డాలర్లు ( రూ.31,500 కోట్లు )
12) భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత సంవత్సరంలో ఎంత శాతం వృద్ధి నమోదు చేస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రకటించింది ?
జ: 7.3శాతం
13) వచ్చే ఏడాదిలో ఎంత వృద్ధిరేటు ఉండొచ్చని ADB అంచనా వేసింది ?
జ: 7.6 శాతం
14) నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజ్ ఛైర్మన్ పదవికి ఎవరు రాజీనామా చేశారు ?
జ: అశోక్ చావ్లా
15) మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఏ క్రికెటర్లపై BCCI సస్పెన్షన్ వేటు పడింది ?
జ: హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్

అంతర్జాతీయం
16) ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ తర్వాత టెన్నిస్ కి గుడ్ బై చెప్పిన మాజీ వరల్డ్ నంబర్ వన్ ఆండీ ముర్రే ఏ దేశానికి చెందిన ఆటగాడు ?
జ: బ్రిటన్

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/