Friday, February 22

CURRENT AFFAIRS – FEB 6

తెలంగాణ
01) నేరం జరిగిన దగ్గర నుంచి కోర్టు తీర్పు వెల్లడయ్యేదాకా రికార్డులు, వివిధ విభాగాల మధ్య జరిగే సమాచారాన్ని ఆన్ లైన్ చేసే ప్రక్రియ ప్రయోగాత్మకంగా వరంగల్ లో అమలవుతోంది. దీన్ని రాష్ట్రమంతటికీ విస్తరించనున్నారు. ఈ ప్రక్రియ పేరేంటి ?
జ: ఇంటర్ ఆఫరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ( ICJS)
02) రాష్ట్రంలో అంకుర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ లో భారీ ఇంక్యుబేటర్ కేంద్రం ఏర్పాటుకు ముందుకు వచ్చిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ఏది ?
జ: ఒప్పో
03) రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో హార్స్ రైడింగ్, క్లైంబింగ్ పై 2.5 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం పేరేంటి ?
జ: సమ్మర్ సమురాయ్
04) రాష్ట్రంలోని 8 జిల్లాల పరిధిలో ఎన్ని గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది ?
జ: 55 గ్రామ న్యాయాలయాలు
05) కేంద్ర ప్రభుత్వం తెచ్చిన గ్రామ న్యాయాలయాల చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 2009 అక్టోబర్ 2
06) ఏ దేశంతో రాష్ట్రంలో విత్తనోత్పత్తి అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్ట్ అమలు గడువును మరో 3యేళ్ళు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ?
జ: జర్మనీతో
07) తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏ మైన్స్ కి జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు దక్కాయి ?
జ: దేవాపూర్ లైమ్ స్టోన్స్ మైన్స్

జాతీయం
08) బహిరంగ స్థలాల్లో మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోడానికి వీలుగా దేశంలో హైదరాబాద్ సహా ఎన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టులు పనులు చేపడుతున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్స్ రాజ్ జి.ఆహిర్ తెలిపారు ?
జ: 8 మహా నగరాల్లో
(నోట్: హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, లఖ్ నవూ )
09) సౌభాగ్య స్కీమ్ కింద డిసెంబర్ 2018 నాటికి దేశంలో విద్యుత్ సౌకర్యం లేని 2.48 కోట్ల ఇళ్ళకి విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. సౌభాగ్య అంటే ఏంటి ?
జ: సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగ్య)
10) విద్యుత్ సౌకర్యంలేని వారు సౌభాగ్య స్కీమ్ కింద కరెంట్ కోసం జాతీయ స్థాయిలో ఏ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి చెప్పవచ్చు ?
జ: 1800 121 5555
11) లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) వాడకంలో ప్రపంచంలో నెంబర్ 2లో నిలిచిన దేశం ఏది ?
జ: భారత్
12) ఇంగ్లండ్ తో సిరీస్ తర్వాత టీ20 క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించిన భారతీయ మహిళా క్రికెటర్ ఎవరు ?
జ: మిథాలీ రాజ్

SI/PC(M)/GR.1,2,3 - 40రోజుల్లో 325 TESTS

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

FEB REVISED 40 DAYS PLAN-converted(1)