Wednesday, September 18

CURRENT AFFAIRS – FEB 27

తెలంగాణ
01) ఎన్నికల్లో గుర్తుల్లో వేటిని తొలగించినట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది ?
జ: ట్రక్కు, ఇస్త్రీ పెట్టె
02) జాతీయ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ నుంచి ఏయే మున్సిపాలిటీలకు అవార్డులు దక్కాయి ?
జ: సిద్ధిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, పీర్జాది గూడ
03) స్వచ్ఛ్ సర్వేక్షణ 2019లో అవార్డు పొందడం ద్వారా రెండోసారి ఈ పురస్కారం దక్కించుకున్న మున్సిపాలిటీ ఏది?
జ: సిద్ధిపేట
04) పెద్దగట్టుపై లింగమంతుల స్వామి జాతర జరుగుతోంది. ఇది ఏ జిల్లాలో ఉంది ?
జ: సూర్యాపేట
05) సామ సదాశివ సాహితీ పురస్కారం ఎవరికి దక్కింది ?
జ: ప్రముఖ కవి, విమర్శకుడు, అనువాదకుడు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి
06) బయో ఫెస్టిసైడ్ అంతర్జాతీయ సదస్సు (బయోకికాన్ 2019) లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డుకి ఎంపైన శాస్త్రవేత్త ఎవరు ?
జ: IICT విశ్రాంత శాస్త్రవేత్త పత్తిపాటి ఉషారాణి
(నోట్: 2019 మార్చి 6న చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని అమిటీ యూనివర్సిటీలో జరిగే బయోకికాన్ 6వ సదస్సులో ఈ పురస్కారం ఇస్తారు. )
07) ఏ విభాగంలో ఉషారాణికి బయోకికాన్ 2019 అవార్డు దక్కింది ?
జ: పర్యావరణ పరిరక్షణ, మొక్కలు, కీటకాల నియంత్రణకు పర్యావరణానికి హాని చేయని దాదాపు 50 రకాల జీవ రసాయాలను అభివృద్ధి చేశారు. వీటిల్లో 11 పేటెంట్లు పొందారు.
08) హైదరాబాద్ లో మరణించిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, పోటీ పరీక్షల శిక్షకుడు ద్వానాశాస్త్రి పూర్తి పేరేంటి ?
జ: ద్వాదశి నాగేశ్వర శాస్త్రి

జాతీయం
09) పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ లోని ఏయే ప్రాంతాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది ?
జ: బాలా కోట్
10) పాక్ లోని జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై దాడికి ఉపయోగించిన విమానాల పేర్లేంటి ?
జ: మిరాజ్ 2000 (మొత్తం 12 విమానాలు )
11) 2015 నుంచి 2018 వరకూ గాంధీ శాంతి బహుమతులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలో అందజేశారు. ఎవరెవరికి దక్కాయి ?
జ: 2015 - వివేకానంద కేంద్ర (కన్యాకుమారి)
2016- అక్షయపాత్ర ఫౌండేషన్, సులభ్ ఇంటర్నేషనల్
2017- ఏకల్ అభియాన్ ట్రస్ట్
2018- యోహి శసకవా
12) ఢిల్లీలోని ఇస్కాన్ మందిరంలో భారీ భగవద్గీతను ఎవరు ఆవిష్కరించారు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
13) సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంస్థ రూ.1.70 కోట్లతో నగదు పురస్కరాల్ని ప్రకటించింది. ఏ పేరుతో ఈ అవార్డులు ఇస్తుంది ?
జ: ఆరోహణ్ సోషల్ ఇన్నోవేషన్

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/