Saturday, April 20

CURRENT AFFAIRS – FEB 2

తెలంగాణ
01) గంట లోపల అత్యధిక బీపీ పరీక్షలు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన ప్రభుత్వ ఆసుపత్రి ఏది ?
జ: గాంధీ ఆస్పత్రి
02) గాంధీ ఆస్పత్రిలో 2018 సెప్టెంబర్ 24న ఎన్ని బ్లడ్ ప్రెషర్ రీడింగ్ లను నమోదు చేసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది ?
జ: 11,416 మందికి
03) అంగన్ వాడీ కేంద్రాలకు రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ-పాస్ యంత్రాల ద్వారా ప్రారంభించారు. ఈ యంత్రాలకు రాష్ట్రంలోని 72వేల అంగన్ వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్లు, సూపర్ వైజర్ల ఆధార్ తో పాటు వేలిముద్ర ఈ-పాస్ మెషీన్లకి అనుసంధానం చేశారు. దీనికి సాంకేతిక సహకారం ఎవరు అందిస్తున్నారు ?
జ: నేషనల్ ఇన్ ఫర్మాటిక్ సెంటర్ ( NIC)
04) రాష్ట్రంలోని కొత్త పంచాయతీలు ఎప్పుడు కొలువు దీరుతున్నాయి ?
జ: ఫిబ్రవరి 2 నుంచి

జాతీయం
05) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2019-20 మధ్యంతర బడ్జెట్ ఎంత ?
జ: రూ.27.84 లక్షల కోట్లు
06) రైతులకు పెట్టుబడి సాయం కింద 5ఎకరాల్లోపు భూములున్న వారికి ఏడాదికి రూ.6 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం పేరేంటి ?
జ: పీఎం-కిసాన్ పథకం
07) పీఎం కిసాన్ పథకం కింద 12 కోట్ల మంది అన్నదాతలకు 2019-20 బడ్జెట్ లో ఎంత మొత్తాన్ని కేటాయించారు ?
జ: రూ.75 వేల కోట్లు
08) గోవుల పరిరరక్షణ కోసం గో సంపదను జన్యుపరంగా తీర్చిదిద్దేందుకు ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేందుకు ఏ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు ?
జ: రాష్ట్రీయ కామధేను ఆయోగ్
09) మౌలిక సదుపాయల అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారుల అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు ?
జ: రూ.83 వేల కోట్లు
10) ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గతంలో ఉన్న 15,500 కోట్ల రూపాయల కేటాయింపులను ఎంతకు పెంచారు ?
జ: రూ.19 వేల కోట్లు
11) 2019-20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ కేటాయింపులు తెలపండి
జ: వ్యవసాయ అనుబంధ రంగాలకు : రూ.1,49,981 కోట్లు
ఎరువుల సబ్సిడీకి రూ.74,986 కోట్లు
12) అసంఘటిత కార్మికులకు నెలకు రూ.3వేల చొప్పున ఇచ్చే ఫించన్ పథకం పేరేంటి ?
జ: ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్
13) ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనకు ఎంత మొత్తం కేటాయించారు ?
జ: రూ.6,400 కోట్లు
14) 2019-20 సంవత్సరానికి రక్షణ బడ్జెట్ ను ఎంతగా ప్రకటించారు ?
జ: రూ.3.18 లక్షల కోట్లు (మొదటిసారి 3 లక్షల కోట్లు దాటింది )
( నోట్: 2019-20 బడ్జెట్ కు సంబంధించి పూర్తి ప్రశ్నలు ( Examination point of view) లో వచ్చే వారంలో వివరించబడును )
15) ఇవాళ్టి నుంచి ప్రొ వాలీబాల్ లీగ్ ఎక్కడ ప్రారంభం అవుతోంది ?
జ: చెన్నైలో
16) చెన్నై, కొచ్చి వేదికలుగా జరిగే ప్రొ వాలీబాల్ లీగ్ లో మొత్తం ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి ?
జ: ఆరు ఫ్రాంచైజీలు

అంతర్జాతీయం
17) మొదటిసారి ఆసియా కప్ ఫుట్ బాల్ విజేతగా నిలిచిన జట్టు ఏది ?
జ: ఖతర్
(నోట్: నాలుగుసార్లు ఛాంపియన్ అయిన జపాన్ ను 3-1తేడాతో ఓడించింది )

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/