Wednesday, September 18

CURRENT AFFAIRS – DEC 30&31

తెలంగాణ
01) కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వైభవంగా జరిగింది. కొమురవెల్లి ప్రస్తుతం ఏ జిల్లాలో ఉంది ?
జ: సిద్ధిపేట జిల్లాలో
02) జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమక్క సారలమ్మ దేవతల చిన్న జాతరను ఎప్పుడు నిర్వహిస్తారు ?
జ: 2019 ఫిబ్రవరి 20
03) తెలంగాణ విత్తనాలను ఏ దేశం దిగుమతి చేసుకునేందుకు ముందుకు వచ్చింది ?;
జ: ఉక్రెయిన్
04) ఏ కార్యక్రమం ద్వారా పశువులకు ఆరోగ్య కార్డులు ఇవ్వాలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు ?
జ: ఇనాఫ్ ( Information Network on Animal Productivity and Health)

జాతీయం
05) అండమాన్ నికోబార్ దీవుల్లో మూడింటి పేర్లు మార్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అవి ఏంటి ?
జ: రాస్ ఐలండ్ - నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ద్వీప్
నీల్ ఐలాండ్ - షహీద్ ద్వీప్
హేవ్ లాక్ ఐలండ్ - స్వరాజ్ ద్వీప్
06) అండమాన్ లో ఎవరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 75యేళ్ళయిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ 75 రూపాయల నాణేన్ని, పోస్టల్ స్టాంప్ ను ఆవిష్కరించారు
జ: నేతాజీ సుభాష్ చంద్ర బోస్
07) కేంద్ర సమాచార కమిషన్ లో కొత్తగా నలుగురిని నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళెవరు ?
జ: యశ్ వర్ధన్ కుమార్ సిన్హా, వనజ ఎన్ సర్నా, నీరజ్ కుమార్ గుప్తా, సురేశ్ చంద్ర
08) తాజాగా నలుగురు సమాచార శాఖ కమిషనర్ల నియామకంతో మొత్తం ఎంత మంది ఉన్నారు ?
జ: ఏడుగురు (మొత్తం 11మంది వరకూ ఉండొచ్చు )
09) సుప్రసిద్ధ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ కోల్ కతాలో చనిపోయారు. ఆయన దర్శకత్వం వహించిన ప్రముఖ కళాత్మక చిత్రం ఏది ?
జ: భువన్ షోమ్
10) తెలుగులో మృణాల్ సేన్ రూపొందించిన ఏ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది ?
జ: ఒక ఊరి కథ
11) పంటల బీమా పథకాలతో ఎక్కువ మంది రైతులను ఆదుకునేందుకు తగినన్ని నిధులు కేటాయించాలని పార్లమెంటరీ అంచనాల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ?
జ: బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి

అంతర్జాతీయం
12) అమెరికాలో దినపత్రికలపై సైబర్ దాడి జరిగింది. కొన్ని ప్రధాన పత్రికల ముద్రణా ప్రక్రియ చేపట్టే ఏ కంప్యూటర్ నెట్ వర్క్ ను హాకర్లు టార్గెట్ గా చేసుకున్నారు ?
జ: ట్రిబ్యూన్ పబ్లిషింగ్
13) బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా మరోసారి విజయం సాధించి అధికారం చేపడుతున్నారు. ఆమె ఇప్పటికి ఎన్నిసార్లు ఎన్నికల్లో గెలిచారు ?
జ: నాలుగు సార్లు
14) షేక్ హసీనాకి చెందిన రాజకీయ పార్టీ ఏది ?
జ: అవామీ లీగ్

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/