Sunday, March 24

CURRENT AFFAIRS – DEC 29

తెలంగాణ
01) ప్రతిష్టాత్మక MNJ కేన్సర్ ఇనిస్టిట్యూట్ గిన్నిస్ బుక్, హైరేంజ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఒక్క రోజులు ఎంతమంది పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ పరీక్షలతో అవగాహన కల్పించినందుకు ఈ రికార్డు లభించింది ?
జ: 487 మందికి
02) MNJ కేన్సర్ ఇనిస్టిట్యూట్ ఎప్పుడు ప్రొస్టేట్ కేన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది ?
జ: 2018 అక్టోబర్ 26నాడు
03) రాష్ట్రానికి చెందిన ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు ?
జ: నేరెళ్ళ వేణు మాధవ్

జాతీయం
04) పొరుగు దేశం భూటాన్ కి భారత్ ఎంత ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు ?
జ: రూ.4500 కోట్లు
05) భారత్ లో పర్యటిస్తున్న భూటాన్ ప్రధానమంత్రి ఎవరు ?
జ: లోతెయ్ శెరింగ్
06) భారత వ్యోమగాములను రోదసీలోకి పంపే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ కి కేంద్రం ఎంతమొత్తం నిధులను కేటాయించింది ?
జ: రూ.10వేల కోట్లు
07) 2022 నాటికి గగన్ యాన్ ద్వారా ఎంతమందిని అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో నిర్ణయించింది ?
జ: ముగ్గురు వ్యోమగాములు
08) భారత్ నుంచి ఇప్పటి వరకూ రోదసికి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఎవరు ? ఎప్పుడు వెళ్ళారు ?
జ: రాకేశ్ శర్మ. 1984 ఏప్రిల్ 2నాడు
09) రాకేశ్ శర్మ రష్యాకి చెందిన ఏ వ్యోమ నౌక ద్వారా రోదసీలోకి వెళ్లారు ?
జ: సోయజ్ టీ - II
10) 2022లో రోదసీలోకి వెళ్ళే వ్యోమగాములను ఏమని పిలవనున్నారు ?
జ: వ్యోమనాట్ లేదా గగన్ నాట్
11) వ్యోమగాములకు ఆహారాన్ని ఏ లేబోరేటరీ తయారు చేస్తోంది ?
జ: మైసూరులోని రక్షణ ఆహార పరిశోధన లేబోరేటరీ
12) పిల్లలపై హేయమైన లైంగిక దాడులకు పాల్పడిన వారికి మరణ శిక్షణతో సహా కఠినమైన శిక్షలు విధించేలా బాలల రక్షణ (పోక్సో) చట్టం 2012 లోని ఏయే సెక్షన్ల కింద సవరణలుచేసింది ?
జ: సెక్షన్ 4, 5, 6
13) మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితంపై వస్తున్న ఏ సినిమా వివాదస్పదం అవుతోంది ?
జ: ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్
14) ఒంటరి పురుషులు (సింగిల్ మేల్ ) కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లల సంరక్షణ కోసం సర్వీసు కాలంలో ఎన్ని రోజుల సెలవులను ఉపయోగించుకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది ?
జ: 730 రోజులు

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/