Wednesday, October 23

CURRENT AFFAIRS – DEC 28

తెలంగాణ
01) తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: జస్టిస్ టిబీఎన్ రాధా కృష్ణన్
02) ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: జస్టిస్ ప్రవీణ్ కుమార్
03) తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారు ?
జ: 13 మంది
04) న్యూ ఇయర్ వేడుకలపై ఎంత శాతం GST చెల్లించాలి ?
జ: 28శాతం
05) దోస్త్ అంటే ఏంటి ?
జ: డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ - తెలంగాణ

జాతీయం
06) ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు 2018 లోక్ సభలో ఎన్ని ఓట్ల మెజార్టీతో నెగ్గింది ?
జ: 245 ఓట్లు ( వ్యతిరేకం 11 ఓట్లు )
07) టెలివిజన్ ప్రేక్షకులు చెల్లింపు ఛానళ్ళని ఎంపిక చేసుకోడానికి గడువును ఎంత వరకూ పెంచుతున్నట్టు భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ ( ట్రాయ్ ) ప్రకటించింది ?
జ: 2019 జనవరి 31 వరకూ
08) ఎప్పటి నుంచి అన్ని మోటారు వాహనాలకు హై సెక్యూరిటీ రిజిష్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరిగా అమర్చాలి ?
జ: 2019 ఏప్రిల్ 1 నుంచి
09) ఏ నదిపై కొత్తగా మరో రిజర్వాయర్ నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది ?
జ: తుంగభద్ర నదిపై
10) 2019 జనవరి 12 నుంచి 13 వరకూ 26వ అంతర్జాతీయ ఒంటెల ఉత్సవం ఎక్కడ జరగనుంది ?
జ: బికనీర్
11) సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం, ఫోన్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, క్యాబ్ బుక్ చేయడం లాంటి వ్యక్తిగత సేవలను అందించేందుకు కృత్రిమ మేథతో AI అసిస్ అందుబాటులోకి తెచ్చింది. దాని పేరేంటి ?
జ: చిట్టి యాప్
( దీన్ని హైదరాబాద్ లో తెలంగాణ ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ప్రారంభించారు)
12) భారత్ లో ఐఫోన్ల తయారీ ఎక్కడ ప్రారంభం కానుంది ?
జ: శ్రీ పెరంబుదూర్ ( తమిళనాడు )
13) మేఘాలయలోని ఏ జిల్లాలో బొగ్గు గనిలో 20మంది చిక్కుకొని పోయారు ?
జ: జయంతియా జిల్లాలోని ( లుంతారి గ్రామంలో)
14) ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంపు వంతెనను ఎక్కడ నిర్మించనున్నారు ?
జ: జమ్ముకశ్మీర్ లోని చినాబ్ నదిపై (ఎత్తు 359 మీటర్లు )
15) గంటకి 180 కిమీ వేగంతో దేశంలోనే వేగవంతమైన ట్రైన్ గుర్తింపు పొందింది ?
జ: ట్రైన్ 18
(నోట్: రూ.100కోట్ల స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రైలుని తయారు చేశారు )
16) ఒక క్యాలెండర్ ఏడాదిలో విదేశాల్లో అత్యధిక పరుగుతు చేసిన భారతీయ క్రికెటర్ గా ఎవరు రికార్డు క్రియేట్ చేశారు ?
జ: విరాట్ కోహ్లీ ( 1138 పరుగులు)
17) గతంలో ఈ రికార్డు ఎవరి పేరున ఉంది ?
జ: రాహుల్ ద్రవిడ్ ( 2002లో 1137 పరుగులు )

అంతర్జాతీయం
18) మల్టీ నేషనల్ కొరియర్ సేవల సంస్థ ఫెడెక్స్ ఎక్స్ ప్రెస్ ప్రెసిడెంట్ అండ్ CEO గా నియమితులైన భారత సంతతి వ్యక్తి ఎవరు ;
జ: రాజేష్ సుబ్రమణియం
19) ప్రపంచంలోనే మొదటగా అత్యంత అధునాత బహుళ ప్రమాణ సాఫ్ట్ వేర్ డిఫైన్డ్ రేడియో చిప్ సెట్ ను ఎక్కడ తయారు చేస్తున్నారు ?
జ: బెంగళూరులో (ఇండియా)

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/