Wednesday, October 23

CURRENT AFFAIRS – DEC 27

తెలంగాణ
01) రాష్ట్రంలో ఏ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్రమోడీని కోరారు ?
జ: కాళేశ్వరం
02) 2019 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో ఫించన్లు ఎంతవరకూ పెరగనున్నాయి ?
జ: వృద్దులు, వితంతువులకు - రూ.2016 (గతంలో వెయ్యి)
వికలాంగుల ఫించన్ : రూ.3016 ( గతంలో 1500)
03) ఇకపై ఎన్ని యేళ్ళు దాటిన వారికి కూడా ఫించన్ వర్తింపజేయనున్నారు ?
జ: 57 యేళ్ళు దాటిన వారికి (గతంలో 65యేళ్ళు ఉండేది )
04) హిమాలయ ప్రాంతంలో కనిపించే రాబందు రాష్ట్రంలోని కుమ్రం బీం జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం నందిగాం దగ్గర కనిపించింది. దీని పేరేంటి ?
జ: గ్రిఫన్ రాంబందు
05) భూసేకరణ సమస్యతో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారి రూటు మార్చారు. ఈ రూట్ నెంబర్ ఎంత ?
జ: 563
06) KTPS (కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్ట్) ఏడో దశ విజయవంతమైంది. జెన్ కో CMD దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. దీంతో విద్యుదుత్పత్తి ఎంతకు పెరిగింది ?
జ: 1720 మెగావాట్ల నుంచి 2520 మెగావాట్లకి
07) ఉమ్మడి ఏపీ విద్యుత్ బోర్డు మాజీ ఛైర్మన్; పద్మభూషణ్ అవార్డు గ్రహీత హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన పేరేంటి ?
జ: టి.ఎల్ శంకర్

జాతీయం
08) ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టుని ఎప్పటి నుంచి విభజించనున్నారు
జ: 2019 జనవరి 1 నుంచి
09) ఏపీకి, తెలంగాణకి ఎంతమంది న్యాయమూర్తులను కేటాయిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు ?
జ: ఏపీకి 14 మంది, తెలంగాణకి 10మంది
10) రిజర్వ్ బ్యాంక్ దగ్గర మిగులు నిధులు ఎంతమేరకు ఉంచాలన్నది తేల్చేందుకు ఆర్థిక మూలధన నిబంధనావళి కమిటీకి ఎవర్ని ఛైర్మన్ గా నియమించారు ?
జ: ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ కమిటీ
11) బిమల్ జలాన్ కమిటీలో మిగతా సభ్యులు ఎవరు ?
జ: ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి రాకేశ్ మోహన్ (వైస్ ఛైర్మన్)
సుభాశ్ చంద్ర గార్గ్ ( ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి )
RBI సెంట్రల్ బోర్డ్ సభ్యులు భరత్ దోషి, సుధీర్ మన్ కడ్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ NS విశ్వనాధన్
12) ప్రస్తుతం ఆర్బీఐ దగ్గర ఎన్ని కోట్ల మిగులు నిధులు ఉన్నాయి ?
జ: రూ.9.6 లక్షల కోట్లు
13) సామాజిక బాధ్యత (CSR) కింద కార్పోరేట్ సంస్థలు చేస్తున్న వ్యయాలు గత ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఉన్నాయి ?
జ: 7,536 కోట్లు
14) పారాదీప్ - హైదరాబాద్ మధ్య ఎన్ని కోట్లతో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటుకు ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల శంకుస్థాపన చేశారు
జ: రూ.3,800 కోట్లు
15) దేశంలోనే అత్యంత పొడవైన 4.94కిమీలు గల రైలు-రోడ్డు వంతెనను అసోంలోని ఏ నదిపై బోగీబీల్ దగ్గర ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు ?
జ: బ్రహ్మపుత్ర నదిపై
16) మోడరన్ సౌత్ ఇండియా : ఎ హిస్టరీ ఫ్రం ది సెవెన్టీన్త్ సెంచురీ టు అవర్ టైమ్స్ - పుస్తకాన్ని రాసింది ఎవరు ?
జ: రాజ్ మోహన్ గాంధీ ( మహాత్మాగాంధీ, రాజగోపాలచారి మనుమడు)

అంతర్జాతీయం
17) ఐసీసీ హాల్ ఆప్ ఫేమ్ లో ఎవరికి చోటు దక్కింది ?
జ: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/