Wednesday, September 18

CURRENT AFFAIRS – DEC 23

తెలంగాణ
01) కరీంనగర్ జిల్లాలో నగనూరులో ఉన్న ప్రతిమా వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన తలసేమియా వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఎవరు ప్రారంభించారు ?
జ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
02) 2016 సంవత్సరానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలను ప్రకటించింది. పద్యకవిత, వచన కవితా రంగంలో ఎవరెవరికి అవార్డులు లభించాయి ?
జ: డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ - శకుంతల ( పద్య కవిత)
అన్నవరం దేవేందర్ - పొక్కిలి వాకిళ్ళ పులకరింత ( వచన కవితలు )
03) తెలుగు వర్సిటీ పురస్కారం కింద ఒక్కో అవార్డీకి ఎంత మొత్తం నగదు అందజేస్తారు ?
జ: రూ.20,116లు
04) ఇండియన్ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపికైన తెలంగాణ వ్యక్తి ఎవరు ?
జ: BVP రావు
05) అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదాన కార్యక్రమం ఎక్కడ జరిగింది ?
జ: కరీంనగర్
06) న్యూఢిల్లీలో నిర్మించిన దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి స్మృతి స్థల్ లో రాష్ట్రంలో ఎక్కడ నుంచి తెప్పించిన రాళ్ళపై ఆయన కవితలు చెక్కుతున్నారు ?
జ: ఖమ్మం నుంచి తెప్పించిన చలువ రాళ్ళు (తొమ్మిది)

జాతీయం
07) న్యూఢిల్లీలో జరిగిన 31వ GST మండలి భేటీలో ఎన్ని వస్తు, సేవలపై GST కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు ?
జ: 23 వస్తు సేవలు
08) హైదరాబాద్ లోని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం ( ఇన్ కాయిస్) లో అంతర్జాతీయ మహాసముద్ర కార్యాచరణ విజ్ఞాన శిక్షణ కేంద్రాన్ని ఎవరు ప్రారంభించారు ?
జ: కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
09) భారత్ - పాక్ మధ్య మరో వివాదానికి కారణమైన జిన్నా హౌస్ ఎక్కడ ఉంది ?
జ: ముంబై మలబార్ హిల్ లో ఉంది
10) ప్రపంచంలో ఏడో అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా ఏది నిలిచింది ?
జ: భారత్ స్టాక్ మార్కెట్
11) ఏడో స్థానంకి రావడం ద్వారా ఏ స్టాక్ మార్కెట్ ను భారత్ అధిగమించింది ?
జ: జర్మనీ
12) ఇండియా అన్ మేడ్: హౌ ది మోదీ గవర్నమెంట్ బ్రోక్ ది ఎకానమీ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు ?
జ: యశ్వంత సిన్హా

అంతర్జాతీయం
13) అగ్రరాజ్యంలో మళ్ళీ ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం ఎంత కావాలని ప్రెసిడెంట్ ట్రంప్ పట్టుబడుతున్నారు ?
జ: 5 బిలియన్ డాలర్లు ( రూ.35 వేల కోట్లు )
14) అరుణ గ్రహ ఉత్తర ధృవంలో 82 కిలో మీటర్లు, రెండు కిలోమీటర్ల లోతు కలిగిన మంచు బిలం ఉన్నట్టు కనిపెట్టిన నాసా నౌక ఏది ?
జ: మార్క్ ఎక్స్ ప్రెస్ ప్రోబ్ వ్యోమ నౌక
15) హిమాలయాల్లో జీవించే ఏ పెద్ద ఉడతల పూర్తి జన్యుపటాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు ?
జ: మార్మోట్ లు
(నోట్: ఇవి మంగోలియన్ మార్మోట్ ల జాతి నుంచి 20లక్షల యేళ్ళ క్రితం వేరుపడినట్టు అధ్యయనంలో తేలింది )

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?

ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?