Wednesday, June 26

CURRENT AFFAIRS – DEC 21

తెలంగాణ
01) దక్షిణాది శీతాకాల విడిది కోసం ప్రతియేటా భారత రాష్ట్రపతి హైదరాబాద్ లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. తొలిసారిగా ఇందులో బస చేసిన రాష్ట్రపతి ఎవరు ? ఎప్పుడు ?
జ: బాబూ రాజేంద్ర ప్రసాద్ ( 1953 జనవరి నెలలో )
02) నిజాం కాలం నాటి ఈ విశ్రాంతి భవనాన్ని ఎవరు కట్టించారు ?
జ: అసఫ్ జాహీ 4వ పాలకుడు నిజాం నజీర్ -ఉద్ - దౌలా శంకుస్థాపన చేశారు
ఇతని కుమారుడు 5వ నిజాం అఫ్జల్ ఉద్ దౌలా పూర్తి చేశారు
03) ప్రతియేటా క్రిస్మస్ సందర్భంగా కెరోల్ సింగింగ్ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది ?
జ: రాజ్ భవన్ లో
04)ప్రధాన మంత్రి శ్రమ పురస్కారాల ప్రకటనలో శ్రమ వీర్ పురస్కారం దక్కించుకున్న హైదరాబాదీ ఎవరు ?
జ: హైదరాబాద్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ కు చెందిన గ్రేడ్ -1 సీనియర్ టెక్నీషియన్ సి.సతీష్

జాతీయం
05) అమెరికాలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు ?
జ: హర్షవర్ధన్
06) అమెరికాలో ఇప్పటిదాకా ఎవరు భారత రాయబారిగా ఉన్నారు ?
జ: నవతేజ్ సర్నా
07) టైమ్ మేగజైన్ 2018 ఏడాదికి ప్రకటించిన అత్యంత ప్రభావశీల టీజేజర్ల జాబితాలో చోటు సంపాదించుకున్న ముగ్గురు భారత సంతతి విద్యార్థులు ఎవరు ?
జ: కావ్య కొప్పరపు, రిషబ్ జైన్, అమికా జార్జ్
08) భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ గా నియమితులైన మాజీ ఓపెనర్ ఎవరు ?
జ: DV రామన్