Wednesday, September 18

CURRENT AFFAIRS – DEC 20

తెలంగాణ
01) వచ్చే బడ్జెట్ లో కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ.9,205 కోట్లు
02) రాష్ట్రంలో ఏర్పడిన ఎన్ని కొత్త మున్సిపాలిటీల్లో 5శాతం ఆస్తిపన్ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ?
జ: 61 కొత్త మున్సిపాలిటీల్లో
03) అటవీశాఖలో కూడా డాగ్ స్క్వాడ్ ను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా రాష్ట్రం నుంచి శిక్షణ పొందిన మొదటి జర్మన్ షపర్డ్ జాతి శునకం ఛీతాని ఏ రిజర్వ్ ఫారెస్ట్ లో సేవలకు ఉపయోగిస్తారు ?
జ: కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో
04) మెదక్ జిల్లాలో ఏ మార్గంలో రైల్వే పనులు పూర్తయి 2019 మార్చి నాటికి పూర్తవుతాయి ?
జ: అక్కన్నపేట - మెదక్ మార్గంలో
05) అఖిలభారత 71వ కామర్స్ సదస్సు ఎక్కడ జరుగుతోంది ?
జ: ఉస్మానియా యూనివర్సిటీలో
06) రాష్ట్రంలో ఏ ఖనిజాలు ఎక్కువగా ఉన్నట్టు 2016-17 నివేదికలో జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది ?
జ: ఇనుప ఖనిజాలు

జాతీయం
07) భారత వాయుసేనకి సమాచార సేవలు అందించేందుకు జీశాట్ 7A ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అయితే దీన్ని మోసుకెళ్ళిన రాకెట్ పేరేంటి ?
జ: GSLF F11
08) జీశాట్ - 7A బరువు ఎంత. ఎన్నేళ్ళ పాటు సేవలు అందించనుంది ?
జ: 2,250 కోట్లు, ఉపగ్రహ జీవిత కాలం 8యేళ్ళు
09)సరోగసీ (రెగ్యులేషన్ )బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బిల్లు చట్టంగా మారితే ఎన్నేళ్ళ వయస్సు మధ్య ఉన్న మహిళలు మాత్రమే సరోగసి (అద్దె గర్భం) కింద దరఖాస్తు చేసుకోవాలి ?
జ: 23-55యేళ్ల వయస్సు
10) 2031 తర్వాతే తెలంగాణ, ఏపీల్లో అసెంబ్లీ సీట్లు పెంచుతామని కేంద్రం ప్రకటించింది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద 2026 తర్వాత చేపట్టే తొలి జనాభా లెక్కల ప్రకారం అసెంబ్లీ సీట్లను పెంచనున్నారు ?
జ: ఆర్టికల్ 170(3)
11) ఆక్స్ ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక ప్రకారం, భారత్ లో 2019 నుంచి 2035 వరకూ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 10 నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారతీయ నగరం ఏది ?
జ: సూరత్ (గుజరాత్)
12) ఆరు నెలలుగా ఉన్న జమ్మూకశ్మీర్ ఎప్పటి నుంచి రాష్ట్రపతి పాలనలోకి వెళ్ళింది ?
జ: 2018 డిసెంబర్ 19 నుంచి
13) ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ-పురుష అంతరాల్లో మన దేశానికి వచ్చిన గ్లోబల్ ర్యాంక్ ఎంత ?
జ: 108 (జెండర్ గ్యాప్ రిపోర్ట్ )
14) హరియాణాలోని గురు గ్రామ్ లో జరిగిన మిస్ టీన్ ఇంటర్నేషనల్ గా నిలిచిన అందాల భామ ఎవరు ?
జ: ఒడలిస్ డ్యుయర్టె ( మెక్సికో)
15) మిస్ టీన్ ఇంటర్నేషనల్ పోటీల్లో మొదటి రన్నరప్ గా నిలిచిన భారత సుందరి ఎవరు ?
జ: రితికా ఖట్నానీ
16) ఆసియా ఛాంపియన్ గా నిలిచిన భారత్ చెస్ అంతర్జాతీయ మాస్టర్ క్రీడాకారిణి ఎవరు ?
జ: పద్మిని రౌత్
17) కబడ్డీ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత కబడ్డీ దిగ్గజం ఎవరు ?
జ: అనూప్ కుమార్

అంతర్జాతీయం
18) ఐక్యరాజ్యసమితి ఐదేళ్ళకోసారి ప్రకటించే ప్రతిష్టాత్మక మానవహక్కుల పురస్కారం 2018కు ఎంపికైన పాకిస్తాన్ మానవ హక్కుల ఉద్యమకారిణి ఎవరు ?
జ: అస్మా జహంగీర్

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS

మొత్తం టైమ్ టేబుల్ వివరాలను ఈ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి:

50 DAYS PLAN TS SI-PC (M) & TSPSC GR.2

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?

ONLINE & OFFLINE టెస్టులకు తేడా ఏంటి ? మాక్ టెస్టులతో సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా?