Wednesday, September 18

CURRENT AFFAIRS – DEC 19

తెలంగాణ
01) తెలంగాణకి చెందిన ఐదుగురు ఆస్ట్రేలియాలోని ఓ శిఖరంపైకి చేనేత వస్త్రాలు ధరించి అధిరోహించారు. ఆ పర్వతం ఏది ?
జ: జిందాబైన్ (7,310 అడుగుల ఎత్తు)
02) పెద్దరాతి యుగంలో నుంచి పెద్ద పట్టణంగా ఎదిగిన ఏ ప్రాచీన పట్టణం తాలూకు ఆనవాళ్ళు పెద్దపల్లి జిల్లాలో బయటపడ్డాయి ?
జ: ఓగనంద పట్టణం

జాతీయం
03) యెస్ బ్యాంక్ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యే అవకాశముంది ?
జ: బ్రహ్మ్ దత్
04) విమాన భద్రత విషయంలో అమెరికా నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ భారత్ కు ఏ రేటింగ్ ను కొనసాగించింది ?
జ: కేటగిరీ 1 (అత్యధిక రేటింగ్ )
05) 2016-17 సంవత్సరంలో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేశారు. అయితే ఈ ఏడాదిలో కొత్త కరెన్సీ నోట్ల ముద్రణ వ్యయం ఎంతగా ప్రభుత్వం తెలిపింది ?
జ: రూ.7,965 కోట్లు
(నోట్: 2017-18 సంవత్సరంలో ముద్రణ ఖర్చులు రూ.4,912 కోట్లు )
06) రాజకీయాలపై రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక రాస్తున్న పుస్తకం 2019 మార్చిలో మార్కెట్లోకి రానుంది. ఆ పుస్తకం పేరేంటి ?
జ: ఎగెనెస్ట్ ఔట్ రేజ్
07) భారత అదనపు సొలిసిటర్ జనరల్ గా ఎవరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది ?
జ: మాధవి దీవాన్
08) అసమానతలకు అతీతంగా మహిళలంతా స్వతంత్రంగా ఎదిగేందుకు వారి కోసం ఏర్పడిన కొత్త రాజకీయ పార్టీ ఏది ?
జ: జాతీయ మహిళా పార్టీ
09) IPL 12 సీజన్ లో రూ.8.4 కోట్ల రూపాయల రేటు దక్కించుకున్న క్రికెటర్ ఎవరు ?
జ: వరుణ్ చక్రవర్తి (తమిళనాడు) ( కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుక్కుంది )

10) అంతర్జాతీయ స్త్రీ-పురుష వ్యత్యాస నివేదిక 2018లో భారత్ కు ఎంత స్థానం లభించింది ?
జ: 108 వ స్థానం
11) మహిళలకు ఆర్థిక అవకాశాల కల్పన ఉప సూచీలో 149 దేశాల్లో భారత్ స్థానం ఎంత ?
జ: 142 వ స్థానం

SI/PC(M)/GR.1,2 & 3- 50రోజుల్లో 325 TESTS
మొత్తం మాక్ టెస్టులు : 320 గ్రాండ్ టెస్టులు : 05

( మొత్తం కవరయ్యే ప్రశ్నలు : దాదాపు 9000)
https://telanganaexams.com/50days-tests/