Wednesday, June 19

CURRENT AFFAIRS – DEC 14

తెలంగాణ
01) ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్ తో పాటు మంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు ?
జ: మహమూద్ అలీ
02) డిప్యూటీ సీఎంగా మరోసారి నియమితులైన మహమూద్ అలీకి ఏ శాఖను సీఎం కేటాయించారు ?
జ: హోంశాఖ
03) నరసింహన్ ఇప్పటికి ఎన్నేళ్ళు గవర్నర్ పదవిలో కొనసాగుతున్నారు ?
జ: దాదాపు 11యేళ్ళు
(నోట్: తెలుగు రాష్ట్రాలకు 9యేళ్ళు. ఛత్తీస్ గఢ్ కి సుమారు రెండేళ్ళు)
04) నరసింహన్ మొదట ఏ రాష్ట్రానికి గవర్నర్ గా పనిచేశారు ?
జ: ఛత్తీస్ గఢ్
05) నరసింహన్ ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు ?
జ: 2009 డిసెంబర్ 28న
06) గవర్నర్ నరసింహన్ తన 11యేళ్ళ పదవీ కాలంలో మొత్తం ఎంతమంది ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు ?
జ: ఆరుగురు
(నోట్: రమణ్ సింగ్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ తో రెండు సార్లు )

జాతీయం
07) మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం చేయనున్నారు ?
జ: కమలనాథ్
08) మాజీ ప్రదాని అటల్ బిహారీ వాజ్ పేయి చిత్రంతో ఎన్ని రూపాయల నాణేన్ని ముద్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: కొత్త 100 రూపాయల నాణెం
09) లోక్ మత్ గ్రూపు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుల్లో భాగంగా లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ ఎవరికి ప్రకటించారు ?
జ: మురళీ మనోహర్ జోషి, శరద్ పవార్
10) దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు ?
జ: బ్రజేంద్ర కుమార్
11) ఆంధ్రప్రదేశ్ లోని సూర్యలంకలో ఏ పేరులో భార వైమానిక దళం క్షిపణి ప్రయోగం నిర్వహించింది ?
జ: క్రాస్ బౌ - 18
12) సదరన్ ఎయిర్ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షిపణి విన్యాసాల్లో ముఖ్య అతిథులుగా భారత వైమానిక దళాధిపతి పాల్గొన్నారు. ఆయన పేరేంటి ?
జ: బీరేందర్ సింగ్ ధనోవా
13) ఆన్ లైన్ లో ఔషధాల అమ్మకాలను వెంటనే నిషేధించాలని మధ్యంతర ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు ఏది ?
జ: ఢిల్లీ హైకోర్టు
14) రిటైలర్లు అందించే వివిధ ఆఫర్లు, ఉత్పత్తుల రేట్లను పోల్చి చూసుకునేందుకు ఉపయోగపడే ఏ ఫీచర్ ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది ?
జ: గూగుల్ షాపింగ్
15) BWF ఈవెంట్ వరల్డ్ టూర్ ఫైనల్ టోర్నమెంట్ లో ప్రపంచ నంబర్ ఒన్ ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఓడించింది. ఆమె పేరేంటి ?
జ: తై జు యింగ్ (చైనీస్ తైపీ ప్లేయర్)

అంతర్జాతీయం
16) శ్రీలంక పార్లమెంటును రద్దుచేస్తూ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్దమని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. శ్రీలంక అధ్యక్షుడు ఎవరు ?
జ: మైత్రిపాల సిరిసేన

PC/SI Mainsకి 100Mock +10 గ్రాండ్ టెస్టులు ప్రారంభం అయ్యాయి.  ఫీజు చెల్లిస్తే 200టెస్టులు ఉచితం https://telanganaexams.com/mocktests/

మాస్టర్స్ అకాడమీ నుంచి వచ్చిన 3 యూట్యూబ్ ఛానెల్స్ SUBSCRIBE చేయండి

తెలంగాణ ఎగ్జామ్స్ ఛానెల్:

https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true మాస్టర్స్ టీవీ https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ?disable_polymer=true ఆంధ్రఎగ్జామ్స్ : https://www.youtube.com/channel/UC2NZvwJ-Ydiavfs90Ea4Alg?disable_polymer=true