Wednesday, June 19

CURRENT AFFAIRS – DEC 12


తెలంగాణ
01) తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు టీఆర్ఎస్ కి దక్కాయి ?
జ: 88 స్థానాలు
(నోట్: కాంగ్రెస్ 19, టీడీపీ 2, బీజేపీ 1, MIM 7 స్థానాలు)
02) ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో హరీశ్ రావు సిద్దిపేట నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆయన మెజార్టీ ఎంత ?
జ: 1,18,699 ఓట్లు
03) రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద ఎబౌ)కి ఎన్ని ఓట్లు పడ్డాయి ?
జ: 1.1శాతం ఓట్లు (2,24,709 ఓట్లు )

జాతీయం
04) ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎన్ని స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది
జ: 68 స్థానాలు
05) ఛత్తీస్ గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి దాకా అధికారంలో ఉన్న బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయి
జ: 15 మాత్రమే
06) రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం సీట్లు 199. ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతోంది?
జ: 100 సీట్లు
(నోట్: బీజేపికి 73, బీఎస్పీకి 6, ఇతరులు 20స్థానాలు )
07) 230 స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు దక్కాయి ?
జ: 114
(నోట్: బీజేపీ 109, బీఎస్పీ 1, ఇతరులు 6 సీట్లు )
08) మిజోరంలో అధికారం చేపట్టనున్న కూటమి పేరేంటి ?
జ: మిజో నేషనల్ ఫ్రంట్
(నోట్: మొత్తం 40 స్థానాలు, 26 చోట్ల ఈ ఫ్రంట్ విజయం సాధించింది )
09) కేంద్ర మానవ వనరుల సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసినది ఎవరు. ఆయన రాజీనామాని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు ?
జ: ఉపేంద్ర కుశ్వాహా (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధ్యక్షుడు)
10) రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: శక్తి కాంత దాస్
11) శక్తి కాంత దాస్ గతంలో ఏ పదవిలో కొనసాగారు ?
జ: రెవెన్యూ విభాగం కార్యదర్శిగా పనిచేశారు.
(నోట్: 15వ ఆర్థిక సంఘం సభ్యుడు. జీ-20 దేశాల సదస్సుల్లో భారత్ తరపున ప్రతినిధి)
12) ఆర్బీఐ 25వ గవర్నర్ గా నియమితులైన శక్తి కాంత దాస్ ఎన్నేళ్ళు ఈ పదవిలో కొనసాగుతారు ?
జ: 3 యేళ్ళ పాటు
13) ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తాత్కాలిక సభ్యుడి పదవికి రాజీనామా చేసిన ప్రముఖ ఆర్థిక వేత్త ఎవరు ?
జ: సుర్జీత్ భల్లా
14) సీనియర్ సిటిజన్స్ కి బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఎంత లోపు ఉంటే ఆదాయం పన్ను మినహాయింపు ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రకటించింది ?
జ: రూ.50వేల లోపు
15) దేశంలో 6 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అవి ఎక్కడ ఉన్నాయి ?
జ: గువాహటి, లఖ్ నవూ, తిరువనంతపురం, అహ్మదాబాద్, జయపూర్, మంగళూరు విమానాశ్రయాలు
16) సిగ్మాయిడ్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన వేర్ ఈజ్ మై ట్రెయిన్ మొబైల్ యాప్ ను కొనుగోలు చేసిన ఐటీ దిగ్గజం ఏది ?
జ: గూగుల్

అంతర్జాతీయం
17) టర్కీలోని సౌదీ అరేబియా కాన్సులేట్ లో హత్యకు గురైన పాత్రికేయుడిని ఈ ఏటి మేటి వ్యక్తిగా టైమ్ మేగజైన్ గుర్తించింది. అతను పేరేంటి ?
జ: జమాల్ ఖషోగీ

SI/PC మెయిన్స్ కి ప్లానింగ్ ఇస్తాం !
ఈవెంట్స్ వాయిదాతో నిరాశ వద్దు !!
https://telanganaexams.com/si-pcmains/