Tuesday, February 25

CURRENT AFFAIRS – APR 26, 27

తెలంగాణ
01) తెలంగాణలో ప్రస్తుతం సౌర విద్యుత్ ఎన్ని మెగావాట్లు ఉత్పత్తి అవుతోంది ?
జ: 3,500 మెగావాట్లు
02) భారతీయ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రదర్శన ( రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్ పో- 2019) ఎక్కడ ప్రారంభమైంది
జ: హైదరాబాద్ లోని హైటెక్స్ లో
03) క్రీ.శ. 2వ శతాబ్దం నాటిదిగా భావిస్తున్న అతి పెద్ద సున్నపు విగ్రహం ఎక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడింది ?
జ: ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో ( ఈ విగ్రహం 1.73 మీటర్ల పొడవు, 35 ఇంచుల వెడల్పుతో ఉంది. వారియర్ పోలికలతో గ్రీకు-ఇండో లక్షణాలు కలిగి ఉంది )
04) మహిళల భద్రతకు సంబంధించి హైదరాబాద్ సహా 8 సేఫ్ సిటీలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. హైదరాబాద్ కి ఎంత నిధులను కేటాయించారు ?
జ: రూ.4వేల కోట్లు

జాతీయం
05) 2018-19 లో ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటు ఎంతగా నిర్ణయించారు ?
జ: 8.65 శాతం
06) కొత్త రూ.20ల నోటును రిజర్వ్ బ్యాంక్ ముద్రించ నుంది. ఇందులో సంతకం చేసే ఆర్బీఐ గవర్నర్ ఎవరు ?
జ: శక్తికాంత దాస్
07) హోల్ సేల్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేయడానికి వీలుగా మొదటి క్రిప్టో కరెన్సీ ఎక్చేంజ్ ఎక్కడ ఏర్పాటైంది ?
జ: బై యు కాయిన్
08) మల్టీ ఫ్లెక్స్ సంస్థ ఐనాక్స్ మొదటి MX4D థియేటర్ ను ఎక్కడ ఏర్పాటు చేసింది ?
జ: ముంబై
09) అత్యాధునిక రక్షణ వ్యవస్థతో రూపొందించిన ప్రియదర్శిని గస్తీ నౌకను ఎక్కడ ప్రారంభించారు ?
జ: AP కాకినాడలోనీ డీప్ వాటర్ ప్రాజెక్టు నుంచి
10) భారత రాజ్యాంగాన్ని కొంకణీ భాషలోకి ట్రాన్స్ లేట్ చేసినది ఎవరు ?
జ: స్టీఫెన్ క్వాడ్రోస్ పెర్ముడే
11) బ్యాంకాక్ లో జరుగుతున్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో బంగారు పతకాలు గెలుచుకున్న బాక్సర్లు ఎవరు ?
జ: అమిత్ ఫంగాల్ (52 కేజీలు ), పూజారాణి (81 కేజీలు)
12) బీజింగ్ లో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ కప్ లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్ లో రజితం గెలిచి ఒలింపిక్ లో స్థానం దక్కించుకున్న భారతీయ ఆటగాడు ఎవరు ?
జ: దివ్యాంశ్ సింగ్ పన్వర్

అంతర్జాతీయం
13) మైక్రో సాఫ్ట్ కంపెనీ మార్కెట్ విలువ మొదటిసారిగా లక్ష కోట్ల డాలర్లు దాటింది. అంటే దాదాపు రూ.70లక్షల కోట్ల రూపాయలు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఎన్నో కంపెనీ ఇది ?
జ: 3వ టెక్నాలజీ కంపెనీ
14) ప్రపంచంలో లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో మొదటి స్థానంలో నిలిచింది మైక్రో సాఫ్ట్. దీనికి CEO ఎవరు ?
జ: సత్య నాదెళ్ళ
15) కౌంటర్ టెర్రరిజంపై పోరాడేందుకు సరిహద్దుల్లో సంయుక్తంగా రియాక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేసుకోవాలని ఏ రెండు దేశాలు నిర్ణయించాయి ?
జ: ఇరాన్ అండ్ పాకిస్తాన్
16) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు ?
జ: టెడ్రూస్ అధానోమ్

 

( APRIL 26, 27 కు సంబంధించి యూట్యూబ్ క్లాసులు సోమవారం అప్ లోడ్ చేస్తాం... వీటికి కొన్ని వివరణలు కూడా జోడించి రెడీ చేశాం.  ఇప్పటికే కరెంట్ ఎఫైర్స్, జనరల్ నాలెడ్జ్ వీడియో లెసన్స్ మన YOUTUBE ఛానెల్ లో ఉన్నాయి. విజిట్ చేయగలరు )

www.telanganaexams.com వెబ్ సైట్ నుంచి అందిస్తున్న కరెంట్ ఎఫైర్స్, జనరల్ నాలెడ్జ్  వీడియో పాఠాలను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు జాతీయ స్థాయిలో జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి పనికి వచ్చేలా ఈ కరెంట్ ఎఫైర్స్ రూపొందిస్తున్నాం.  దయచేసి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానెల్ ను subscribe చేయండి.

మీకు ఉచితంగా ప్రిపరేషన్ ప్లాన్స్, సబ్జెక్ట్ లెసన్స్, నిపుణుల సలహాలు, నిపుణుల ఇంటర్వ్యూలు, కరెంట్ ఎఫైర్స్, జీకే అంశాలు వీటిల్లో పోస్ట్ చేయబడను. ఇవి TSPSC, APPSC నిర్వహించే ఎగ్జామ్స్ తో పాటు బ్యాంకులు, రైల్వేలు ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా పనికి వచ్చేలా ఈ క్లాసులు రూపొందిస్తున్నాం.  మిగతా వాళ్ళలాగా... అనవసర మెటీరియల్ ఇవ్వకుండా... కేవలం Examination point of view లో మాత్రమే మన క్లాసులు ఉంటాయి.

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

మాస్టర్స్ టీవీ - For a Real News ( అన్ని వార్తలకు ఈ ఛానెల్ ను subscribe చేయండి)
https://www.youtube.com/channel/UC1zxevIMCLp8vuEKe5PhlXQ

ఆంధ్ర ఎగ్జామ్స్ ఛానెల్ కోసం 

https://www.youtube.com/channel/UC2NZvwJ-Ydiavfs90Ea4Alg/featured?disable_polymer=true