Monday, September 23

CURRENT AFFAIRS – APR 23

తెలంగాణ
01) పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోత పథకం నిర్మాణానికి రూ.10వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థ ఏది ?
జ: పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్
02) ప్రముఖ ఈకామర్స్ కంపెనీ హైదరాబాద్ లో డేటా సెంటర్ ను ప్రారంభించింది. ఆ సంస్థ ఏది ?
జ: ఫ్లిప్ కార్ట్
03) US ఓపెన్ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ లో బంగారం పతకం గెలుచుకున్న తెలంగాణ క్రీడాకారుడు ఎవరు ?
జ: వివేక్ తేజ

జాతీయం
04) ఏ దేశం నుంచి చమురు దిగుమతులను పూర్తిగా ఆపివేయాలని భారత్ కు అమెరికా ఆంక్షలు విధించింది ?
జ: ఇరాన్
05) ట్విట్టర్ ఇండియా ఎండీగా ఎవరు నియమితులయ్యారు ?
జ: మనీష్ మహేశ్వరి
06) సైబర్ దాడుల కారణంగా ఆర్థిక నష్టాలు, ప్రతిష్ట దెబ్బతినడం వల్ల వ్యాపార సంస్థలకు రక్షణ ఇచ్చేలా ప్రత్యేకంగా సైబర్ బీమా పాలసీని అందుబాటులోకి తెచ్చిన బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఏది ?
జ: SBI General Insurance
07) జన్ ధన్ ఖాతాల్లో 2019 ఏప్రిల్ 3 నాటికి ఎన్ని కోట్లు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది ?
జ: రూ.97,665.66 కోట్లు
(నోట్: ప్రస్తుతం దేశంలో జన్ ధన్ ఖాతా సంఖ్య 35.39 కోట్లు )
08) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2014 ఆగస్టు 28న
09) జమ్ము కశ్మీర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ ద్వారా పాకిస్తాన్ తో జరిగే వాణిజ్యాన్ని భారత్ ఎప్పుడు నిలిపివేసింది ?
జ: 2019 ఏప్రిల్ 19నాడు
10) సిక్కుల పవిత్ర స్థలమైన కర్తార్ పూర్ (గురుద్వార దర్బార్ సాహిబ్ మందిర్) పాకిస్తాన్ లో ఎక్కడ ఉంది ?
జ: నరోవాల్ (రావి నదికి దగ్గర్లో)
11) తనిష్క్ జ్యూయలరీకి దక్షిణాదిన బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: నటి నయనతార
12) మే 2న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను ఎక్కడ నిర్వహించనున్నారు ?
జ: ఉప్పల్ స్టేడియంలో
13) దోహాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో తేజిందర్ పాల్ సింగ్ తూర్, గోమతి మరిముత్తు బంగారు పతకాలు సాధించారు. వీళ్ళు ఏ రంగానికి చెందిన ప్లేయర్స్ ?
జ: గోమతి : మహిళళల 800 మీటర్ల రేసు
తేజిందర్ : పురుషుల షాట్ పుట్ ఈవెంట్

అంతర్జాతీయం
14) ఉక్రెయిన్ అధ్యక్షుడిగా హాస్యనటుడు ఎన్నికయ్యారు. ఆయన పేరేంటి ?
జ: వ్లోడిమిర్ జెలెన్ స్కీ