Friday, February 21

CURRENT AFFAIRS – APR 25

తెలంగాణ
01) కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఎల్లంపల్లి నీటిని భారీ మోటర్లతో ఎత్తి పోసే వెట్ రన్ విజయవంతమైంది. ఈ నీటిని ఏ రిజర్వాయర్ లోకి పంపింగ్ చేశారు ?
జ: నందిమేడారం
02) మొహర్రం, బోనాల పండగల సమయంలో ఊరేగింపులో పాల్గొనే ఓ ఏనుగును హైకోర్టు ఆదేశాలతో బయటకు పంపబోమని నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులు చెప్పారు. ఆ ఏనుగు పేరేంటి ?
జ: రజనీ (54 యేళ్ళు)
03) గోదావరి పరివాహక ప్రాంతాల్లో చమురు నిక్షేపాల కోసం ONGC సర్వే చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఈ సర్వే జరుగుతోంది ?
జ: భూపాలపల్లి జిల్లా కాటారం కేంద్రంగా
04) మౌలిక వసతుల కల్పనలో వినూత్న విధానాలు అమలు చేస్తున్నందుకు మిషన్ భగీరథకి జాతీయ స్థాయిలో దక్కిన అవార్డు ఏది ?
జ: గృహ నిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ (హడ్కో) అవార్డు

జాతీయం
05) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై లైంగిక ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ?
జ: జస్టిస్ అరుణ్ మిశ్రా
06) టిక్ టాక్ యాప్ పై నిషేధం విధించి, కొన్ని షరతులతో మళ్లీ నిషేధం ఎత్తివేసిన హైకోర్టు ఏది ?
జ: తమిళనాడులోని మద్రాస్ హైకోర్టు
07) ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రయాణీకుల తరలింపు ద్వారా రూ.4 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించి భారత రైల్వేల్లో రెండో స్థానంలో నిలిచిన జోన్ ఏది ?
జ: దక్షిణ మధ్య రైల్వే
(నోట్: 2018-19 సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే 38.90 కోట్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చి టిక్కెట్లు, లగేజీల రూపంలో రూ.4,059 కోట్లు ఆర్జించింది )
08) ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీ - 2019 లో భారత ర్యాంకు ఎంత ?
జ: 140 వ ర్యాంకు
(నోట్: రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే అంతర్జాతీయ సంస్థ ఈ సర్వే చేస్తుంది. ఈ సంస్థ హెడ్డాఫీసు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉంది. 180 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో భారత్ 140వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే రెండు స్థానాలు దిగజారింది )
09) 2018 సంవత్సరానికి సరస్వతీ సమ్మాన్ సాహితీ పురస్కారం ఎవరికి దక్కింది ?
జ: కె.శివారెడ్డి
(నోట్: ఈ అవార్డును బిర్లా ఫౌండేషన్ అందిస్తుంది. ఈ అవార్డుకి ఎంపికైన మొదటి తెలుగు వ్యక్తి శివారెడ్డి. ఆయన రచించిన పక్కకి ఒత్తిగిలితే కవితా సంపుటికి అవార్డు దక్కింది )
10) సూక్ష్మ జీవి నిరోధక ప్రొటీన్ ( యాంటీ మైక్రోబియల్ ప్రొటీన్ - AMP) ఆనవాళ్ళను సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు ఏ పాలల్లో గుర్తించారు ?
జ: ఎకిడ్నా పాలల్లో
11) జీవిత బీమా సంస్థ (LIC) దక్షిణ మధ్య ప్రాంతీయ మేనేజర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ?
జ: మిని ఐప్
12) నరసింహం కమిటీ సిఫార్సులతో ఏయే బ్యాంకుల నుంచి ఆర్బీఐ తప్పుకోనుంది ?
జ: నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB), నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ (NABARD)
13) ఇటీవల ఏ దేశానికి చెందిన పాలల్లో రసాయనాలు ఉన్నట్టు గుర్తించడంతో వాటిని భారత్ ప్రభుత్వం నిషేధించింది ?
జ: చైనా
14) ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మహిళల 1500మీటర్ల పరుగులో బంగారు పతకం గెలుచుకుంది ఎవరు ?
జ: పీయూ చిత్ర
15) BCCI సలహా కమిటీలో కొనసాగుతూ ముంబై, స‌న్‌రైజ‌ర్స్‌ ఫ్రాంచైజీల్లో బాధ్యతలు నిర్వహించడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకి వస్తుందని సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ కి అంబుడ్స్‌మ‌న్‌ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం BCCI అంబుడ్స్‌మ‌న్‌ ఎవరు ?
జ: డీకే జైన్

అంతర్జాతీయం
16) ప్రపంచంలోనే మొదటిసారిగా మలేరియాకి టీకా మందును ఏ దేశం అమల్లోకి తెచ్చింది ?
జ: మలావీ (ఆఫ్రికా దేశం)
17) మలేరియా టీకాను అమల్లోకి తేవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఈ టీకా పేరేంటి ?
జ: RTSS
18) జపాన్ అసెంబ్లీలోకి అడుగుపెడుతున్న భారత సంతతి వ్యక్తి ఎవరు ?
జ: పురాణిక్ యోగేంద్ర అలియాస్ యోగి
(నోట్: జపాన్ రాజధాని టోక్యో పరిధిలోని ఎదోగవా వార్డు అసెంబ్లీ స్థానంలో గెలిచారు )
19) భారత్ తో 70యేళ్ళ బంధానికి గుర్తుగా ఏ దేశంలో రామాయణ ఇతివృత్తంతో ప్రత్యేక స్టాంపును ఆ దేశ ప్రభుత్వం విడుదల చేసింది ?
జ: ఇండోనేసియా

 

కరెంట్ ఎఫైర్స్ వీడియో కోసం చూడండి :