Saturday, March 23

CURRENT AFFAIRS – APR 24

రాష్ట్రీయం
1) ఈనెల 29, 30ల్లో ఇండియా - సౌతాఫ్రికా బిజినెస్ సమ్మిట్ లో పాల్గొంటున్న తెలంగాణ మంత్రి ఎవరు ?
జ: కేటీఆర్
2) ఆరోగ్య శ్రీ ట్రస్ట్ CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: IAS అధికారి కె.మాణిక్ రాజ్
3) హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల నాలుగు లేన్లతో ఎన్ని కిలోమీటర్లలో రీజినల్ రింగ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: 338 కిమీ

జాతీయం
4) భారత ప్రధాన న్యాయమూర్తిపై ఏ ఆర్టికల్ కింద 64 మంది ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి అభిశంసన నోటీసు ఇచ్చారు ?
జ: 124 (4) అధికరణం
5) రాజ్యాంగంలోని ఏ అధికరణానికి లోబడి 124(4) అధికరణం కింద ఎంపీలు ఇచ్చిన నోటీసును అనుమతించాలా... వద్దా... అన్న నిర్ణయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీసుకున్నారు ?
జ: 217 వ అధికరణం
6) 48 యేళ్ళ క్రితం 1970 మేలో ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంపీల నుంచి అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు ?
జ: జస్టిస్ సి. షా
(నోట్: లోక్ సభ స్పీకర్ జి.ఎస్.థిల్లాన్ ఈ తీర్మానాన్ని అప్పట్లో తిరస్కరించారు)
7) 2015లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ న్యాయమూర్తి పేరేంటి ?
జ: జస్టిస్ జె.బి. పార్దీవాలా
8) 2016లో శ్రీనగర్ లో తీవ్రవాదులను ఎదుర్కొంటూ తీవ్రంగా గాయపడి చనిపోయిన ఎవరికి మరణానంతరం ప్రకటించిన కీర్తి చక్ర అవార్డును వారి కుటుంబసభ్యులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అందజేశారు ?
జ: గిరిష్ గురుంగ్
9) ఈశాన్య రాష్ట్రాల్లో వివాదస్పదంగా మారిన ఏ చట్టాన్ని మేఘాలయలో ఎత్తివేశారు ?
జ: సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం
(నోట్: అరుణాచల్ ప్రదేశ్ లో 8 పోలీస్ స్టేషన్లకే పరిమితం చేశారు )
10) 2017లో ప్రవాస భారతీయులు భారత్ కు ఎంత మొత్తం పంపారు ?
జ: రూ.4.50 లక్షల కోట్లు (68 బిలియన్ డాలర్లు )
11) టాటా సన్స్ గ్లోబల్ కార్పొరేట్ వ్యవహారాల అధ్యక్షుడిగా చేరిన మాజీ విదేశాంగ కార్యదర్శి ఎవరు ?
జ: ఎస్. జయశంకర్
12) TTK ప్రెస్టేజ్ బ్రాండ్ అంబాసిడార్ గా నియమితులైన బాలీవుడ్ నటి ఎవరు ?
జ: విద్యా బాలన్

అంతర్జాతీయం
13) వాతావరణ మార్పులపై పోరాటానికి రూ.30కోట్ల విరాళం ప్రకటించింది ఎవరు ?
జ: మైఖేల్ బ్లూమ్ బర్గ్
(నోట్: ప్రముఖ మానవతావాది, ఐక్యరాజ్యసమితిలో వాతావరణ కార్యాచరణపై ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. )
14)గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కి 2015లో వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు ఇచ్చిన ఎన్ని షేర్లతో రూ.2,500కోట్లు లభించనున్నాయి ?
జ: 3,53,939
15) అవినీతిని నిర్మూలించడంపై IMF కొత్త విధానాలను రూపొందిస్తోంది. ప్రస్తుతం IMF లో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది ?
జ: 189 దేశాలు

రూ.200 స్పెషల్ డిస్కౌంట్ ( ఈనెల 25 వరకూ పొడిగింపు )
SI/PC/GR.II/VRO మాక్ టెస్టులకు ఆఫర్స్
https://telanganaexams.com/discount/

RRB (గ్రూప్ C &D) 10 గ్రాండ్ టెస్టులు
(డిస్కౌంట్ రేటు ఈనెల 25 వరకూ పొడిగింపు)
https://telanganaexams.com/rrb-gt-tests/