Wednesday, October 23

CURRENT AFFAIRS – APR 22

తెలంగాణ
01) ప్రతి రెండేళ్ళకోసారి జరిగే మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరను ఎప్పుడు నిర్వహించనున్నారు ?
జ: 2020 ఫిబ్రవరి 5,6,7, 8 తేదీల్లో
(నోట్: మాఘ శుద్ధ పౌర్ణమికి అటు ఇటుగా వచ్చే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో జాతర నిర్వహిస్తారు )
02) కవి అంతరంగం పేరుతో కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సాహితీ సంస్థ ఏది ?
జ: కరీంనగర్ సాహితీ గౌతమి
03) కరీంనగర్ సాహితీ గౌతమి సంస్థ ఆధర్వర్యంలో నీటి మనసు సంకలనంపై కవి అంతరంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సంకలనాన్ని ఎవరు రచించారు ;
జ: తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందినీ సిధారెడ్డి

జాతీయం
04) దేశంలోని 1.5 లక్షల తపాలా కార్యాలయాల్లో నెట్ వర్క్ ను (డిజిటల్) ఏర్పాటు చేసిన ప్రముఖ ఐటీ దిగ్గజం ఏది ?
జ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ( TCS)
05) ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల యొక్క థీమ్ ఏంటి ? ( నినాదం )
జ: దేశ్ కా మహాత్యోహార్
06) 2019-20 సంవత్సరానికి భారత జీడీపీ ఎంత శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది ?
జ: 7.5 శాతంగా
07) 2002 ఉత్తరప్రదేశ్ IPS కేడర్ కు చెందిన మహిళా అధికారి ఇటీవల దక్షిణ ధృవాన్ని చేరుకున్నారు. ఇక్కడికి వెళళ్ళిన మొదటి మహిళా IPS గా రికార్డు సృష్టించారు. ఆమె పేరేంటి ?
జ: అపర్ణ కుమార్
08) దోహాలో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో ఎవరెవరికి పతకాలు దక్కాయి ?
జ: అన్నురాణి, అవినాష్ - రజితాలు, పరుల్ చౌదరి, పూవమ్మ - కాంస్యాలు సాధించారు
09) అన్నురాణి ఏ విభాగానికి చెందిన క్రీడాకారిణి ?
జ: జావెలిన్ త్రో
10) ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో పురుషుల 67 కేజీల యూత్ లిఫ్టర్ విభాగంలో యూత్ వరల్డ్, యూత్ ఆసియా రికార్డులతో పాటు జాతీయ సీనియర్ రికార్డ్ సాధించిన భారతీయ లిఫ్టర్ ఎవరు ?
జ: జెరేమీ లాల్ రినుంగా (మిజోరాం)
11) లూథియానాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దేశీవాళీ ఫుట్ బాల్ టోర్నీ సంతోష్ ట్రోఫీని ఏజట్టు గెలుచుకుంది ?
జ: సర్వీసెస్ జట్టు ( 6వ సారి టైటిల్ గెలుచుకుంది )

అంతర్జాతీయం
12) ఈస్టర్ పండుగ నాడు విదేశీయులే లక్ష్యంగా ఏ దేశంలో 8 చోట్ల బాంబు దాడులు జరిగాయి ?
జ: శ్రీలంక
13) శ్రీలంక అధ్యక్ష, ప్రధానుల పేర్లేంటి ?
జ: అధ్యక్షుడు : మైత్రిపాట సిరిసే, ప్రధాని : రణిల్ విక్రమ సింఘే
14) ప్రపంచ హోమియోపతి దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది ?
జ: ఏప్రిల్ 10
(నోట్: హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టిన డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానీమన్ పుట్టిన రోజు సందర్బంగా ఈ రోజున ప్రతియేటా నిర్వహిస్తారు )
15) యుద్ధ రంగంలో సైనికులకు సాయపడేందుకు వీలుగా రోబోల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేస్తున్నట్టు ప్రకటించిన దేశం ఏది ?
జ: అమెరికా
16) గూగుల్ మొదటిసారిగా వాణిజ్య డ్రోన్ డెలివరీ సౌకర్యాన్ని ఎక్కడ ప్రారంభించింది ?
జ: ఆస్ట్రేలియా