Saturday, March 23

CURRENT AFFAIRS – APR 18

రాష్ట్రీయం
1) పంటల పెట్టుబడి కోసం నగదు సాయం అందించే రైతు బంధు పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు ?
జ: మే 10 నుంచి
2) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) లో రాష్ట్రంలో వివిధ రంగాలకు రుణ పంపిణీ సామర్థ్యం ఎంతగా నాబార్డు అంచనా వేసింది ?
జ: రూ.83,388 కోట్లు
3) తెగుళ్ళని తట్టుకునే ఆధునిక వంగడాల అభివృద్ధికి, బూజు కారణంగా వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్లను అడ్డుకునేందుకు పరిశోధనలు చేస్తున్న ఇద్దరు శాస్త్రవేత్తలకు ఇక్రిశాట్ అవార్డులు దక్కాయి. వారి పేర్లేంటి?
జ: మమతా శర్మ, పూజా భట్నాగర్
4) వాతావరణ అనుకూల వ్యవసాయ విధానాలు, వ్యూహాలు, కార్యక్రమాలు అనే అంశంపై 3 రోజుల సార్క్ దేశాల సదస్సు ఎక్కడ జరిగింది ?
జ: రాజేంద్రనగర్ లోని నార్మ్ లో ( జాతీయ వ్యవసాయ పరిశోధన యాజమాన్య సంస్థ )
5) వర్షాధార భూముల్లో సాగుపై అఖిల భారత సమన్వయ పరిశోధనా పథకాన్ని రాష్ట్రంలోని ఏ పరిశోధనా కేంద్రానికి భారత వ్యవసాయ పరిశోధనా మండలి కేటాయించింది ?
జ: ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం
6) రాష్ట్రంలో ఏయే కళాకృతులకు జీఐ రిజిష్ట్రరీ చెన్నై భౌగోళిక సంస్థ గుర్తింపు ఇచ్చింది?
జ: డోక్ర ( ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ), దరీస్( వరంగల్ జిల్లా )
7) డోక్ర కళాకృతులను దేంతో తయారు చేస్తారు ?
జ: ఇత్తడి లోహంతో
8) దరీస్ (జంప ఖానాలు ) కళాకృతులను ఎవరు తయారు చేస్తారు ?
జ: చేనేత కార్మికులు

జాతీయం
9) రాజ్యాంగ సవరణ ద్వారా దేశంలో రెండు దఫాలుగా జమిలి ఎన్నికలను ఎప్పుడెప్పుడు నిర్వహించ వచ్చని లా కమిషన్ సూచించింది ?
జ: 2019 మొదటి దశ, 2024 లో రెండో దశ
10) ప్రపంచంలోనే మొదటిసారిగా డెంగీకి ఆయుర్వేద మందును తయారు చేసిన భారత శాస్త్రవేత్తలు ఎవరు ?
జ: ద సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ శాస్త్రవేత్తలు
11) అంగారకుడు, శుక్రుడి దగ్గరకు వ్యోమ నౌకలను పంపేందుకు ఏ దేశంతో కలసి పనిచేయాలని భారత్ నిర్ణయించింది ?
జ: ఫ్రాన్స్ తో
(నోట్: ఫ్రాన్స్ రోదసీ సంస్థ CNES తో కలసి ఇస్రో పనిచేస్తుంది )
12) లక్ష కోట్లతో ఏయే నగరాల మధ్య కొత్త రైల్వే ఎక్స్ ప్రెస్ మార్గాన్ని వేయాలని కేంద్రం నిర్ణయించింది ?
జ: ఢిల్లీ - ముంబై ( 125 కిమీ దూరం తగ్గిపోతుంది )
13) 2019 లో భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని IMF అంచనా వేసింది ?
జ: 7.8శాతం (ప్రస్తుత ఏడాది 7.4శాతం )
14) బ్యాంక్ కుంభకోణాలపై మే 17న తన ఎదుట హాజరు కావాలని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను పార్లమెంటరీ సంఘం కోరింది. ఈ సంఘానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు ?
జ: ఎం.వీరప్ప మొయిలీ (ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం )`
15) దేశంలోని ఏ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ కు ఫార్మా రంగంలో అంతర్జాతీయ పురస్కారం లభించింది ?
జ: శంషాబాద్ విమానాశ్రయం
(నోట్: World Health organisations Good storage and Distribution Practices అవార్డు )
16) బెంగళూరులో చనిపోయిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత టి.వి.ఆర్ షెణాయ్ ఏ రంగానికి చెందినవారు ?
జ: ప్రముఖ పాత్రికేయుడు

అంతర్జాతీయం
17) హాలీవుడ్ లో దిగ్గజ నిర్మాత లైంగిక వేధింపుల బాగోతాన్ని బయటపెట్టిన ఏయే పత్రికలకు జర్నలిజంలో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ బహుమతి దక్కింది ?
జ: న్యూయార్క్ టైమ్స్, న్యూయార్కర్
18) పరిశోధనాత్మక పాత్రికేయ విభాగంలో ఏ పత్రికకు పులిట్జర్ బహుమతి లభించింది ?
జ: వాషింగ్టన్ పోస్ట్

SI/PC/GR.II/VRO/GR.IV మాక్ టెస్టుల కోసం క్లిక్ చేయండి :

http://tsexams.com/pcvro-mock-test/