Friday, February 21

CURRENT AFFAIRS – 11 MAR

తెలంగాణ
01) తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ?
జ: ఏప్రిల్ 11న ఒకే దఫాలో
02) రాష్ట్రంలో 33 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఎంతమంది ఓటర్లు ఉన్నారు ?
జ: 2,95,18,964
03) రాష్ట్రంలో మొత్తం ఎన్ని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ?
జ: 17 ఎంపీ సీట్లు
04) రాష్ట్రంలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గం ఏది ? ఎంతమంది ఉన్నారు ?
జ: మల్కాజ్ గిరి పార్లమెంటు స్థానం 30,98,816 మంది ఓటర్లు
05) రాష్ట్రంలో అత్యల్ప ఓటర్లు ఉన్న నియోజకవర్గం ఏది ? ఎంతమంది ఉన్నారు ?
జ: మహబూబాబాద్ - 14,14,210 ఓటర్లు
06) తెలంగాణలో జైలు రేడియో గురూ పేరుతో FM స్టేషన్ ను ఎక్కడ ప్రారంభించారు ?
జ: చంచల్ గూడా జైలులో
07) అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ?

జ: ఆర్వీ రామారావు
08) ఒకేసారి వెయ్యిమందితో మాట్లాడే విధంగా గ్రూప్ కాల్ చేసే సౌకర్యం ఉన్న ఏ యాప్ ను రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో వినియోగించాలని నిర్ణయించారు ?
జ: గ్రూప్ టాక్ యాప్

జాతీయం
09) దేశంలో మొత్తం ఎన్ని లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ?
జ: 543 స్థానాలు
10) ఈసారి లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఏయే రాష్ట్రాల్లో జరుగుతాయి ?
జ: ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం
11) ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్లు ఎవరు ?
జ: ప్రధాన ఎన్నికల కమిషనర్లు - సునీల్ అరోడా, ఎన్నికల కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర
12) నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యం (MNM) పార్టీకి ఈసీ ఏ ఎన్నికల గుర్తు కేటాయించింది ?
జ: బ్యాటరీ టార్చ్
13) తొలిసారిగా ట్రాన్స్ జెండర్స్ కి ఏ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు ?
జ: 2014 ఎన్నికల్లో
14) 2014 ఎన్నికల్లో ఓటు హక్కు పొందిన ట్రాన్స్ జెండర్స్ ఎంతమంది ?
జ: 28,314
15) కోస్టారికాలో పర్యటిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ దేశ కాంగ్రెస్ అధ్యక్షురాలు, తొలి ఉపాధ్యక్షురాలితో రాజధాని శాన్ జోస్ లో సమావేశం అయ్యారు. ఆమె పేరేంటి ?
జ: కరోలినా ఈద్గా
16) భారత్ లో తయారైన రైల్వే బోగీలు చరిత్రలోనే మొదటిసారిగా ఏ దేశానికి ఎగుమతి అవుతున్నాయి ?
జ: మొజాంబిక్ (90 పెట్టెలు)
17) మొజాంబిక్ దేశానికి మన దేశం నుంచి 90 రైల్వే బోగీలను పంపుతున్నారు. అయితే ఇవి ఎక్కడ తయారు చేస్తున్నారు ?
జ: రాయ్ బరేలీలోని మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ ( ఉత్తర్ ప్రదేశ్)
18) విద్యుత్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సాహించేందుకు స్కూటర్ కి 20వేలు, కారుకు లక్షన్నర, బస్సుకు 50 లక్షల వరకూ సబ్సిడీ ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారు ?
జ: 2019 ఏప్రిల్ 1 నుంచి మూడేళ్ళ పాటు

అంతర్జాతీయం
19) బయట నుంచి వెలువడే అనవసర శబ్దాలను అడ్డుకునేందుకు అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సాధనం ఏది ?
జ: అకౌస్టిక్ మెటా మెటీరియల్

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

మీరు మా మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులకు ఫీజులు చెల్లించడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/