- ఇంధనం నిండుకోవడంతో పేలిపోయిన ఒక నక్షత్రానికి సంబంధించిన అవశేషాలను ఖగోళశాస్త్రవేత్తలు గుర్తించారు. దాని పరిధి సౌర కుటుంబం కన్నా 600 రెట్లు పెద్దగా ఉందని తెలిపారు.
- 11వేల యేళ్ళ క్రితం ఆ నక్షత్రం పేలిపోయింది. చిలీలో ఉన్న VL సర్వే టెలిస్కోపు సాయంతో దీన్ని కనుగొన్నారు.
- విస్ఫోటం వల్ల ఆ తార వెలుపలి పొరలు… రంగుల మేఘాలుగా విశ్వంలోకి వ్యాపించాయి. పేలుడుతో బలమైన ప్రకంపనలు వచ్చాయి.
- ఆ నక్షత్రం మధ్య భాగం అధిక సాంద్రత కలిగిన న్యూట్రాన్ తారగా మారింది.
- పేలడానికి ముందు ఈ నక్షత్రానికి సూర్యుడి కన్నా 8 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉండేదని శాస్త్రవేత్తలు తెలిపారు.
- పాలపుంత గెలాక్సీలో భూమికి 800 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
సౌరకుటుంబం కన్నా పెద్దదైన నక్షత్ర అవశేషం

Space stars and nebula as purple abstract background