Sunday, January 20

రేపట్నుంచి 5 రోజులు బ్యాంకులకి సెలవులు

బ్యాంకులు వరుసగా 5 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. దీంతో డబ్బులు కోసం జనానికి ఇబ్బందులు తప్పేలా లేవు. శుక్రవారం నాడు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్ బ్యాంకుల సమ్మెకు పిలుపు ఇచ్చింది. ఆ తర్వాత 22న నాలుగో శనివారం, 23న ఆదివారం.. మూడు రోజులు వరుసగా బ్యాంకులు పనిచేయవు. మళ్ళీ 24న సోమవారం ఒక్క రోజే తెరుస్తారు. 25న క్రిస్మస్ కావడంతో మళ్ళీ సెలవు. 26న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ సమ్మెకు పిలుపు ఇచ్చింది. దాంతో ఒక్క సోమవారం తప్ప... రేటి నుంచి 5 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. 21న సమ్మె అయినప్పటికీ... ATMలు పనిచేస్తాయి. కానీ 26న జరిగే సమ్మెతో ATM సేవలు కూడా బంద్ అయ్యే అవకాశముంది. వరుస సెలవులతో భయపడుతున్న జనం ATM ల ముందు క్యూ కడుతున్నారు. రోజువారీ కార్యకలాపాలకు నగదు అవసరం కావడంతో తమ ఖాతాల నుంచి క్యాష్ డ్రా చేసుకుంటున్నారు చాలామంది.