Thursday, September 19

AUG 2018- CA TOP – 60(2nd part)

AUG 2018- CA TOP - 60(2nd part)
01) 2018 ఆగస్టు 11 నుంచి రాష్ట్రంలో పాడి పశువుల పంపిణీ పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింది యూనిట్ మొత్తం ఎంత ?
జ: రూ.80వేలు + రూ.5వేల వరకూ రవాణా ఖర్చు
02) రాష్ట్రంలో 2018 ఆగస్ట్ 14 అర్థరాత్రి నుంచి రైతు బీమా పథకం అమల్లోకి రానుంది. రైతు ఏ కారణంతోనైనా కన్నుమూస్తే ఎంత మొత్తం చెల్లిస్తారు ?
జ: రూ.5లక్షలు
03) ఇండోనేషియాలో జరిxrl ఆసియా క్రీడల్లో భారత్ తరపున ఎంతమంది ఆటగాళ్ళు వివిధ క్రీడాంశాల్లో పాల్గొన్నారు ?
జ: 572 మంది

04) 2018 ఆగస్ట్ 18 నుంచి ఇండోనేషియాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ తరపున జాతీయ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించిన ప్లేయర్ ఎవరు ?
జ: జూనియర్ జావెలిన్ నీరజ్
05) 30 లక్షల డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు ఉండే సూర్యుడి బాహ్య వాతావరణ వలయమైన కరోనాలోకి తొలిసారిగా నాసా పంపిన రోబోటిక్ వ్యోమ నౌక పేరేంటి ?
జ: పార్కర్ సోలార్ ప్రోబ్
06) హైదరాబాద్ లో రూ.250 కోట్లతో ఏర్పాటు చేసిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయో టెక్నాలజీ భవనాన్ని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. దీన్ని ఎక్కడ నిర్మించారు ?
జ: గోపనపల్లి
07) జమ్ము కశ్మీర్ హైకోర్టులో చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె పేరేంటి ?
జ: జస్టిస్ గీతా మిట్టల్
08) డిజిటల్ ఆర్థిక ప్రపంచం ఏర్పాటులో భాగంగా బ్లాక్ చెయిన్ బాండ్ల విక్రయాలను మొదలుపెట్టాలని నిర్ణయించిన సంస్థ ఏది ?
జ: ప్రపంచ బ్యాంకు
09) 12యేళ్ళ లోపు బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్ష సహా కఠిన శిక్షలు వేయడానికి ఉద్దేశించిన క్రిమినల్ లా (సవరణ) చట్టం - 2018 కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ?
జ: 2018 ఏప్రిల్ 21 నుంచి
10) 2018 ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జనధన్ ఖాతాల్లో ఓవర్ డ్రాఫ్ట్ పరిమితిని ఎంతకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ?
జ: రూ. 10 వేలు ( గతంలో రూ.5వేలుగా ఉంది )
11) పార్లమెంటేరియన్ గా తన అనుభవాలతో కూడిన పుస్తకాన్ని సోమ్ నాథ్ ఛటర్జీ రాశారు. ఆ పుస్తకం పేరేంటి ?
జ: Keeping The Faith : Memoirs Of A Parliamentarian, The Collected Speeches of Somnath Chatterjee
12) దేశాభిమానాన్ని చూరగొనే బ్రాండ్స్ జాబితాలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఏది ?
జ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(నోట్: బ్రిటన్ కు ఆన్ లైన్ మార్కెట్ రీసెర్చ్, డేటా అనలిటిక్స్ సంస్థ యాగవ్ ఈ సర్వే నిర్వహించింది )
13) ది ఎకనమిస్ట్ పత్రిక రూపొందించిన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యంగా ఉన్న నగరాల్లో మన దేశానికి చెందిన నగరాలకు వచ్చిన ర్యాంకులు ఏవి ?
జ: ఢిల్లీ - 112 వ స్థానం, ముంబై 117 వ స్థానం
14) ది ఎకనమిస్ట్ పత్రిక రూపొందించిన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యంగా ఉన్న నగరాల్లో మొదటి స్థానం ఏ నగరానికి దక్కింది ?
జ: వియన్నా (ఆస్ట్రియా రాజధాని )
15) రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం ఎన్ని యూనిట్లు గా ఉంది ?
జ: 1,507 (జాతీయ స్థాయిలో 1,122 యూనిట్లు )
16) 2022 కల్లా మానవ సహిత అంతరిక్ష యాత్రను ఏ పేరుతో చేపడతామని ఇస్రో ఛైర్మన్ కె. శివన్ వెల్లడించారు ?
జ: గగన్ యాన్
17) కౌమార బాలిక రుతుస్రావం, రుతు చక్రంపై అవగాహన కల్పించి, రక్తహీనతతో బాధ పడేవారిని గుర్తించి పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఏది?
జ: సమత
18) భానుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో 2019-20 మధ్య ఏ పేరుతో ప్రయోగాలు చేపట్టనుంది ?
జ: ఆదిత్య - ఎల్ 1
19) 2018 ఆసియా క్రీడల మోటో ఏది ?
జ: ఎనర్జీ ఆఫ్ ఆసియా
20) ఆసియా క్రీడల ప్రారంభ వేడుకలు ఇండోనేషియా రాజదాని జకర్తాలో ఏ స్టేడియంలో జరిగాయి ?
జ: జలోరా బంగ్ కర్నో స్టేడియంలో
21) ముగ్గురు కొత్త గవర్నర్ల నియామకం/ కొందరికి స్థానచలనం
బిహార్ గవర్నర్ - లాల్ జీ టాండన్
జమ్ము కశ్మీర్ -సత్యపాల్ మలిక్
ఉత్తరాఖండ్ - బేబి రాణి మౌర్య
హరియాణా - సత్యదేవ్ నారాయణ్ ఆర్య
త్రిపుర - కప్తాన్ సింగ్ సోలంకీ
సిక్కిం - గంగా ప్రసాద్
మేఘాలయ - తథాగత్ రాయ్
22) 2018 ఆసియా క్రీడల్లో 50 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన హరయాణా అమ్మాయి ఎవరు ?
జ: వినేశ్ ఫోగాట్
(నోట్: ఆసియా క్రీడల చరిత్రలో స్వర్ణం గెలిచిన మొదటి భారతీయ మహిళా రైజ్లర్ )
23) రాష్ట్రంలో పండే ప్రతి ప్రధాన పంటకి ఒక మార్కెట్ ఉండేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం జగిత్యాలలో ఏ మార్కెట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ?
జ: మామిడి మార్కెట్
నల్లగొండ జిల్లా నకిరేకల్ లో ఉన్న మార్కెట్ ఏది ?
జ: నిమ్మమార్కెట్
నల్గొండలో ఉన్న మార్కెట్ ఏది ?
జ: బత్తాయి మార్కెట్
సిద్ధిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గంగాపూర్ లో ఉన్న మార్కెట్ ఏది ?
జ: పచ్చి మిర్చి మార్కెట్
24)2018 ఆగస్టు 24 నాడు గుజరాత్ లోని 26 జిల్లాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1.15 లక్షల ఇళ్ళను ప్రత్యక్ష ప్రసార సదస్సు విభాగంతో ప్రారంభించినది ఎవరు ?
జ: ప్రధాని నరేంద్ర మోడీ
25) దేశంలో 5జీ సేవలపై అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది ?
జ: ఏజె పాల్ రాజ్ కమిటీ
26) ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణకు తెలంగణ ప్రభుత్వం తీసుకొచ్చిన బాలిక ఆరోగ్య రక్ష పథకాన్ని ఎవరు ప్రారంభించారు ?
జ: 2018 ఆగస్టు 24న నాడు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
(నోట్: వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తిలోని తెలంగాణ రాష్ట్ర గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కాలేజీలో ప్రారంభించారు )
27) కాళేశ్వరం పథకంలో భాగంగా భూగర్భంలో నిర్మించిన గ్యాస్ ఇన్స్ లేటెడ్ వ్యవస్థ మొదటి 400కేవీ సబ్ స్టేషన్ ప్రారంభమైంది. దీన్ని ఎక్కడ నిర్మించారు ?
జ: పెద్దపల్లి జిల్లా నందిమేడారం
28) అటల్ జీ నే కహా - అనే పుస్తకం రాసింది ఎవరు ?
జ: బ్రిజేంద్ర రేహి
29) రాష్ట్రంలో ఏడు కొత్త జోన్లు, రెండు మల్టీ జోన్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దీంతో 1975లో విడుదలైన ఏ అధికరణం రద్దయింది ?
జ: 371 డి
30) 8) ఆస్ట్రేలియాలోని డార్విన్ లో జరుగుతున్న KAKADU 2018 మేరీటైమ్ సంయుక్త విన్యాసాల్లో భారత్ తరపున పాల్గొంటున్న నావీ షిప్ ఏది ?
జ: INS సహ్యాద్రి