Thursday, September 19

AUG 2018 CA – TOP 60(1st part)

01) నాలుగో విడత హరితహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్ట్ 1 నాడు ఎక్కడ ప్రారంభించారు ?

జ: గజ్వేల్ (లక్షా 116 మొక్కలు నాటారు )
02) బయో టెక్నాలజీ, బయో ఫార్మా రంగాల్లో పరిశోధనలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో ప్రవేశించే పరిశ్రమల ప్రోత్సాహకానికి హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో ఏది ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు ?
జ: బీ - హబ్
(నోట్: రూ.60కోట్ల వ్యయంతో ప్రైవేటు - పబ్లిక్ భాగస్వామ్య పద్దతిలో )
03) రైతు బీమా బాండ్లను ఎప్పటి నుంచి రాష్ట్రంలోని రైతులకు అందజేశారు ?
జ: 2018 ఆగస్టు 6 నుంచి
04) భారత దేశానికి వ్యూహాత్మక రక్షణ, హై టెక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు నాటో దేశాల సరసన చేరుస్తూ ఏ హోదాని అమెరికా ఇచ్చింది ?
జ: స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్ - 1 (STA-1)
05) లంచం ఇచ్చేవారికి గరిష్టంగా ఎన్నేళ్ల జైలు శిక్ష విధించడానికి ఉద్దేశించిన కొత్త చట్టానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ?
జ: ఏడేళ్ళ జైలు (అవినీతి నిరోధక చట్టం (సవరణ) 1988)
06) జాతీయ సమగ్రత, మతసామరస్యం, శాంతి కోసం కృషి చేసిన వారికి ఏటా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ సద్భావన అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు ?
జ: పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనుమడు గోపాల్ కృష్ణ గాంధీ
07) సామాజిక అడవుల శాతాన్ని పెంచేందుకు అన్ని విద్యా సంస్థల్లో ఏ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు ?
జ: హరిత పాఠశాల
08) 2014-17 కాలానికి ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎవరెవరికి అవార్డులు దక్కాయి ?
జ: నజ్మా హెప్తుల్లా, హుకుమ్ దేవ్ నారాయణ్ యాదవ్, గులాం నబీ ఆజాద్, దినేశ్ త్రివేది, భర్తృహరి మహతాబ్ `
09) 2018 ఆగస్టు 2న నేర పరిశోధనలో కీలకంగా మారే ఏ విధానాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు ?
జ: ముఖ కవళికల గుర్తింపు విధానం ( FRS)
10) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు (NCBC) కి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించే కీలకమైన బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. దీన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు ?
జ: 123వ రాజ్యాంగ సవరణ బిల్లు
11) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ -1993 (NCBC) ఎప్పుడు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు ?
జ: 1993 ఆగస్టు 14న
12) జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కు (NCBC) ఏర్సాటుకు సుప్రీంకోర్టు ఏ కేసులో ఇచ్చిన తీర్పే కారణం ?
జ: ఇంద్రా సాహ్ని కేసులో
13) శత్రు క్షిపణులను చిత్తు చేసే అధునాతన సూపర్ సోనిక్ నిరోధక క్షిపణి పరీక్షను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. దీన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు ?
జ: బాలాసోర్ లోని అబ్దుల్ కలాం దీవి నుంచి
14) అమెరికా మార్కెట్లో మొదటిసారిగా 1 ట్రిలియన్ డాలర్లు (లక్ష కోట్లు) (దాదాపు రూ.68లక్షల కోట్లు) మార్కెట్ విలువ సాధించిన కంపెనీ ఏది ?
జ: యాపిల్
15) రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతంలో 110 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు ?
జ: తుమ్మలూరులో
16) దేశంలోనే తొలిసారిగా బ్లాక్ చైన్ డిస్ట్రిక్ట్ ను ఎక్కడ ఏర్పాటు చేయడానికి టెక్ మహేంద్రా ముందుకొచ్చింది ?
జ: హైదరాబాద్
17) నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ( NCAER) సర్వే ప్రకారం దేశంలో పెట్టుబడులు ఆకర్షణలో ఏ రాష్ట్రం టాప్ లో నిలిచింది ?
జ: ఢిల్లీ
18)ఎన్ని కోట్లకు మించి విలువ కలిగిన ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు విదేశాలకు పారిపోతే వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళుగా గుర్తించేందుకు ఉద్దేశించిన ఎకనమిక్ అఫెండర్స్ చట్టం 2018కి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు ?
జ: రూ.100 కోట్లు
19) దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో జరిగిన మూడవ 2018 బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన భారతీయ సినిమా ఏది ?
జ: న్యూటన్
20) రోహింగ్యాలపై జరిగిన అకృత్యాలను విచారించేందుకు మయన్మార్ ప్రభుత్వం నియమించిన నలుగు సభ్యుల స్వతంత్ర్య కమిషన్ ఏది ?
జ: రాసారియో మనాలో కమిటీ
21) పెప్సికో CEOగా 12 యేళ్ళ పాటు పనిచేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ఇండో అమెరికన్ ఎవరు ?
జ: ఇంద్రానూయి (2019 వరకూ ఛైర్మన్ గా కొనసాగుతారు )
22)కౌంటీ దిగ్గజం మిడిలెసెక్స్ తో కలసి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నడుపుతున్న అకాడమీ ఎక్కడ ప్రారంభించారు ?
జ: లండన్ లో (నార్త్ వుడ్ లోని మార్చంట్ టేలర్ స్కూల్లో )
23) 2018 ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎవరి పేరున 30 మంది చేనేత కళాకారులకు మంత్రి కేటీఆర్ అవార్డులు ప్రదానం చేశారు ?
జ: కొండా లక్ష్మణ్ బాపూజీ
24) 2018 ఆగస్ట్ 7 నాడు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?
జ: జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ జోసెఫ్
25) నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా ప్రకటించిన యువ శాస్త్రవేత్త - 2018 జాబితాలో చోటు దక్కించుకున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ చెందిన ఇద్దరు పరిశోధకులు ఎవరు ?
జ: అరవింద్ కుమార్, సుష్మీ బదులిక
26) దేశంలో నాలుగేళ్ళ సగటు తలసరి ఆదాయం ఎంతగా ఉన్నట్టు గణాంకాల సహాయ మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు ?
జ: రూ.79,882
27) 2018-19 నాటికి భారత వృద్ధి ఎంత శాతంగా నమోదు అవుతుందని IMF ఎగ్జిక్యూటివ్ బోర్డు అంచనా వేసింది ?
జ: 7.3శాతం
28) రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: హరివంశ్ నారాయణ్ సింగ్ ( 125 ఓట్లు )
29) ట్రాయ్ ప్రస్తుత ఛైర్మన్ పదవీ కాలాన్ని మరో రెండేళ్ళ పాటు ప్రభుత్వం పొడిగించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఎవరు కొనసాగుతున్నారు ?
జ: రామ్ సేవకర్ శర్మ
30) మైత్రి 2018 పేరుతో భారత్ ఏ దేశం మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి ?
జ: థాయ్ లాండ్