Wednesday, September 18

2018 APR CA – TOP 50 (2nd Part)

01) ఏప్రిల్ 2018 లో BSE లో అత్యధిక మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీగా ఏ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది ?
జ: టాటా కన్సల్టెన్సీ సర్వీస్ ( TCS) ( రూ.6,00,569 కోట్ల మార్కెట్ క్యాప్ )
02) ఏప్రిల్ 2018 లో ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత ప్రాంతాలకు మంచినీరు, సాగు నీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి ఎవరు పేరు పెట్టారు ?
జ: సాగునీటి రంగ నిపుణుడు, ఆర్.విద్యాసాగర్ రావు
03) రాష్ట్రంలో ఏ నదికి ఏప్రిల్ 14, 2018 నుంచి 28 వరకూ కుంభమేళా జరుగుతోంది ?
జ: మంజీరా
(నోట్: సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండలంలోని రాఘవపూర్ - హుమ్నాపూర్ గ్రామాల శివార్లలో కుంభమేళా నిర్వహిస్తున్నారు )
04) గిరిజన ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులను మెరుగు పరచి, వాటికి మార్కెట్ సదుపాయం కలిగించే ఏ పథకాన్ని ప్రధాని ప్రారంభించారు ?
జ: వన్ ధన్ ( ఈ పథకం కింద వనవికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు )
05) 65వ జాతీయ సినిమా అవార్డుల్లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ఎవరికి ప్రకటించారు ?
జ: వినోద్ ఖన్నా
06) రైళ్ళు, స్టేషన్లలో ఆహారం నాణ్యత, మరుగుదొడ్ల అపరిశుభ్రత లాంటి అంశాలపై ఫిర్యాదు చేసేందుకు రైల్వేశాఖ తెస్తున్న యాప్ ఏది ?
జ: మదద్


07) కామన్వెల్త్ గేమ్స్ లో 66 పతకాలు గెలుచుకొని... పతకాల పట్టికలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. మొత్తం ఎన్ని బంగారు, రజిత, కాంస్య పతకాలు గెలుచుకుంది ?
జ: 26 స్వర్ణాలు, 20 రజితాలు, 20 కాంస్యాలు
08) కామన్వెల్త్ క్రీడల్లో బాక్సింగ్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి మహిళా బాక్సర్ ఎవరు ?
జ: మేరీ కామ్
09) ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ‘ది రివొల్యుషనరీ అండ్ విజినరీ పర్సనాలిటీ కే.చంద్రశేఖర్ రావు’ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
జ: సీనియర్ జర్నలిస్టు మహ్మద్ ఇబ్రహీం కరార్
10) షొరెన్‌స్టెయిన్‌ జర్నలిజం అవార్డు అందుకుంటున్న సీనియర్ జర్నలిస్ట్ సిద్దార్థ్ వరద రాజన్ ప్రస్తుతం ఏ వెబ్ పోర్టల్ నడుపుతున్నారు ?
జ: ది వైర్
11) రాష్ట్రంలో ఏయే కళాకృతులకు జీఐ రిజిష్ట్రరీ చెన్నై భౌగోళిక సంస్థ గుర్తింపు ఇచ్చింది?
జ: డోక్ర ( ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ), దరీస్( వరంగల్ జిల్లా )
12) హాలీవుడ్ లో దిగ్గజ నిర్మాత లైంగిక వేధింపుల బాగోతాన్ని బయటపెట్టిన ఏయే పత్రికలకు జర్నలిజంలో ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ బహుమతి దక్కింది ?
జ: న్యూయార్క్ టైమ్స్, న్యూయార్కర్
13)మేలుకొలుపు పుస్తకాన్ని ఎవరు రాశారు ?
జ: మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం
14) గృహ నిర్మాణ ప్రక్రియలో అవలంభిస్తున్న విధానాలకు గుర్తింపుగా ప్రధానమంత్రి ఎక్స్ లెన్స్ అవార్డుతో దేశంలోనే ఘనత సాధించిన మొదటి సంస్థగా ఏది నిలిచింది ?
జ: గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ హైదరాబాద్ (GHMC)
15) ప్రతిష్టాత్మక యుధ్ వీర్ స్మారక పురస్కారం దక్కించుకున్న హైదరాబాద్ యువకుడు ఎవరు ?
జ: సయ్యద్ ఉస్మాన్ అజహర్ మక్సూసీ
(నోట్: ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న యువకుడు )
16)టైమ్ మేగజైన్ రూపొందించిన ప్రపంచంలోని 100మంది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్న మన దేశానికి చెందిన ప్రముఖులు ఎవరు ?
జ: ఓలా సంస్థ సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్
17) ఇస్లామిక్ రాజ్యమైన సౌదీ అరేబియాలో 35 యేళ్ళ తర్వాత తొలిసారి సినిమా థియేటర్ ప్రారభమైంది. ఇందులో ప్రదర్శించిన మొదటి సినిమా ఏది ?
జ: బ్లాక్ పంథర్ (హాలీవుడ్ మూవీ )
18) దేశంలో తొలి నగదు రహిత దీవిగా ఏది నిలచింది ?
జ: మణిపూర్ లోని కరంగ్ (97 శాతం డిజిటల్ విధానంలోనే చెల్లిస్తారు )
19) దేశంలో మొట్టమొదటి 100 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించనున్న కంపెనీ ఏది ?
జ: TCS (టాటా కన్సల్టన్సీ సర్వీసెస్ )
20) 2018-19లో భారత్ GDP వృద్ధి రేటు ఎంతకు చేరుతుందని RBI అంచనా వేస్తోంది ?
జ: 7.4 శాతం
21) 2018 ఏప్రిల్ 22 నాడు వరల్డ్ ఎర్త్ డే. ఈ ఏడాది థీమ్ ఏంటి ?
జ: End Plastic Pollution
22) భారత ప్రధాన న్యాయమూర్తిపై ఏ ఆర్టికల్ కింద 64 మంది ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి అభిశంసన నోటీసు ఇచ్చారు ?
జ: 124 (4) అధికరణం
23) వాతావరణ మార్పులపై పోరాటానికి రూ.30కోట్ల విరాళం ప్రకటించింది ఎవరు ?
జ: మైఖేల్ బ్లూమ్ బర్గ్
(నోట్: ప్రముఖ మానవతావాది, ఐక్యరాజ్యసమితిలో వాతావరణ కార్యాచరణపై ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. )
24) బ్రహ్మోస్ క్షిపణిని భారత్ - రష్యా కలసి సంయుక్తంగా అభివ్రుద్ధి చేశాయి. ఈ క్షిపణి ఎన్ని మ్యాక్ ల వేగంతో ప్రయాణిస్తుంది ?
జ: 2.8 మ్యాక్ లు (ధ్వని వేగం కన్నా 2.8 రెట్లు) (బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ: సుధీర్ మిశ్ర)
25) దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు సిక్కిం సీఎం పవన్ చామ్లింగ్. ఆయన మొత్తం ఎంత కాలం పనిచేశారు ?
జ: 23 యేళ్ళ 138 రోజులు
26) 400 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపురంలో
27) చారిత్రక ఎర్రకోటను వచ్చే ఐదేళ్ళపాటు నిర్వహణ, అభివృద్ధి పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఎవరికి కాంట్రాక్ట్ కి ఇచ్చింది ?
జ: దాల్మియా భారత్ గ్రూప్
28) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం ద్వారా ఆకాంశం నుంచి ఆకాశంలోకి దూసుకుపోయే ఏ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు ?
జ: బీవీఆర్ క్షిపణి
29) సుప్రీంకోర్టులో మొత్తం ఎంతమంది న్యాయమూర్తులు ఉండవచ్చు ?
జ: 31మంది
30) సైన్యానికి రూ.3,687 కోట్ల విలువైన 127 MM తుపాకులతో కూడిన నాగ్ క్షిపణి వ్యవస్థను సమకూర్చబోతున్నారు. ఈ వ్యవస్థను రూపొందించింది ఎవరు ?
జ: DRDO

SI/PC/VRO/GR.IV - 200 మాక్ టెస్టులు

ఎగ్జామ్స్ ముందు ప్రాక్టీస్ టెస్టులే కీలకం 

https://telanganaexams.com/mocktests/