Saturday, January 19

సిద్ధిపేటలో ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్

సిద్ధిపేటలో జరిగే ఎయిర్ మెన్ గ్రూప్ - వై ( నాన్ టెక్నికల్) (మెడికల్ అసిస్టెంట్ ) ట్రేడ్ పోస్టులకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ కింది లింక్ ద్వారా చూడగలరు.

SIDDIPET- MED ASST (Final)

(వయస్సు, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు, శారీరక దారుఢ్య పరీక్షలు, రాత పరీక్షలకు సంబంధించిన అన్ని వివరాలు ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి. )

ఈనెల 22 నుంచి 25 వరకూ సిద్ధిపేటలో ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ జరుగుతోంది. రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన అభ్యర్థులకు సిద్ధిపేటలోనే నియామకాలు జరగనున్నాయి. శారీరక, మెడికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ కమాండర్ నరేంద్ర కుమార్కర్ తెలిపారు.

డిసెంబర్ 22, 23తేదీల్లో 15 జిల్లాల నుంచి వచ్చిన వారికి, 24,25 తేదీల్లో మిగిలిన 16 జిల్లాల వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఈవెంట్స్ స్థలం: సిద్ధిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం (ఉదయం 5 గంటలకే చేరుకోవాలి )

విద్యార్హతలు: ఇంటర్ బైపీసీలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి

1998 జులై 14 నుంచి 2002 జూన్ 28 మధ్య జన్మించి ఉండాలి. 152 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి.

డిసెంబర్ 22, 23 తేదీల్లో ఈ కింది జిల్లాల అభ్యర్థులు హాజరవ్వాలి:
నల్లగొండ
సూర్యాపేట
యాదాద్రి భువనగిరి
నిజామాబాద్
కామారెడ్డి
రంగారెడ్డి
మేడ్చల్
వికారాబాద్
వరంగల్ రూరల్
వరంగల్ అర్బన్
జనగామ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహబూబాబాద్
హైదరాబాద్

డిసెంబర్ 24, 25 తేదీల్లో ఈ కింది జిల్లాల అభ్యర్థులు హాజరవ్వాలి:

ఆదిలాబాద్
కొమురం భీం అసిఫాబాద్
మంచిర్యాల
నిర్మల్
కరీంనగర్
జగిత్యాల
పెద్దపల్లి
రాజన్న సిరిసిల్ల
భద్రాద్రి కొత్తగూడెం
ఖమ్మం
జోగులాంబ గద్వాల్
మహబూబ్ నగర్
నాగర్ కర్నూల్
వనపర్తి
మెదక్
సంగారెడ్డి
సిద్ధిపేట

(నోట్: ఉదయం 5 గంటల లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు హాజరు కావాలి )