సైన్యంలోకి ప్రవేశించి దేశ సేవ చేయాలని అనుకునేవారికి శుభవార్త. అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీలు జరగబోతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 2024 డిసెంబర్ 8 నుంచి 16 వరెకూ అగ్నివీర్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు చెందిన వారిని సైన్యంలోకి అగ్నివీర్ లను చేర్చుకోడానికి ఈ ర్యాలీలు జరుగుతాయి.
ఇది కూడా చదవండి : Semi Conductors Jobs : 10 లక్షల కొలువుల్లో మీకూ ఒకటి
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/ స్టోర్ కీపర్ పోస్టులకు 10వ తరగతి, ట్రేడ్స్ మెన్ పోస్టులకు 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి (కరైకల్ -యానాం) నుంచి మహిళా మిలటరీ పోలీస్ అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరి 12 నాటి నోటిఫికేషన్ ప్రకారం అన్నిడాక్యుమెంట్స్ తీసుకురావాలి.
రిక్రూట్ మెంట్ ప్రక్రియలో ఉత్తర్ణత సాధించడానికి, నమోదు చేయడానికి సహకరిస్తామంటూ మాయ మాటలు చెప్పే మోసగాళ్ళను నమ్మొద్దని అగ్నివీర్ రిక్రూట్ మెంట్ కార్యాలయం తెలిపింది.
అభ్యర్థులకు ఏవైనా డౌట్స్ ఉంటే : 040-27740059, 27740205 నంబర్లలో సంప్రదించవచ్చు.