దక్షిణ మధ్య రైల్వే స్పోర్ట్స్ కోటా నియామక ప్రకటన 2025 61 ఉద్యోగాలు
దక్షిణ మధ్య రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) స్పోర్ట్స్ కోటా (Sports Quota) ద్వారా ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. మొత్తం 61 ఖాళీలకు అర్హత కలిగిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో క్రీడా ట్రయల్స్, సర్టిఫికెట్ ధృవీకరణ ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 24, 2025.
దక్షిణ మధ్య రైల్వేలో Sports Quota లో ఉద్యోగాల వివరాలు
మొత్తం పోస్టులు: 61
అర్హత: 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా సమానమైన అర్హత, పాఠశాల, విశ్వవిద్యాలయం, రాష్ట్ర లేదా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొనడం.
వయస్సు పరిమితి: 18 నుంచి 25 సంవత్సరాలు
దరఖాస్తు రుసుము: ₹500 (SC/ST/OBC/మైనారిటీ/దివ్యాంగులకు ₹250)
ఎంపిక విధానం: క్రీడా ట్రయల్స్ అండ్ ధృవీకరణ
పరీక్ష కేంద్రం: సికింద్రాబాద్ లేదా SCR నిర్ణయించే ఇతర కేంద్రాలు
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 24, 2025
అధికారిక వెబ్సైట్: scr.indianrailways.gov.in
ఏయే Sports Quota లో ఎన్ని ఉద్యోగాలు ? విభాగాల వారీగా ఖాళీలు:
- లెవల్ 3/2: 21
- లెవల్ 1: 10
- సికింద్రాబాద్ డివిజన్: 5
- హైదరాబాద్ డివిజన్: 5
- విజయవాడ డివిజన్: 5
- గుంటూరు డివిజన్: 5
- గుంతకల్ డివిజన్: 5
- నాందేడ్ డివిజన్: 5
ఈ నియామక ప్రక్రియ ద్వారా క్రీడా ప్రతిభను ప్రదర్శించిన యువతకు ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియను అధికారిక వెబ్సైట్ ద్వారా పూర్తి చేయవచ్చు.
ఇంకా వివరాలు కావాలంటే, మీరు SCR అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు.
 
				 
         
         
         
															 
                     
                         
                         
                         
    
    
        