G-948507G64C

రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు లేవు…

Table of Contents

అడిగినోళ్ళకి కొలువులు ఇయ్యరు
వద్దన్నోళ్ళకి పిలిచి ఇస్తున్నరు
ఇదేం సంస్కృతి రేవంతన్నా ?

జాబ్ కేలండర్ అతీ గతీ లేదు….
ఖాళీగా ఉన్న పోస్టులను కూడా ఇప్పటికే కొలువులు చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే పిలిచి పిలిచి మరీ ఇస్తున్నారు…
రేవంత్ సర్కార్ లో ఏం నడుస్తుందో అర్థం కావడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
10వేల 954 GPO పోస్టులు… గ్రామపాలనాధికారి పోస్టుల భర్తీ కోసం మాజీ VRO, VRA లను తీసుకున్నది ప్రభుత్వం…
ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా నోటిఫికేషన్ ఇచ్చింది…
రండి బాబూ రండి అంటూ పిలుస్తోంది… కానీ వాళ్ళు మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు…
ఇక్కడ నిరుద్యోగులేమో ఉద్యోగాలు కావాలి రేవంతన్నా అంటే…
గవర్నమెంటేమో… మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే ఉద్యోగాలు ఇస్తోంది…
GPO పోస్టుల భర్తీ విషయంలో అసలేం జరుగుతోంది

BRS లో తీసేసిన గ్రామ రెవెన్యూ వ్యవస్థ మళ్ళీ తీసుకురావాలని … జనం ఇబ్బందులు పడుతున్నారని
ఆలోచించింది… అందుకే VRO వ్యవస్థను తీసుకురావాలని… గ్రామపానాధికారులు… అంటే GPO పేరుతో భర్తీచేయాలని అనుకుంది…
రాష్ట్రంలో మొత్తం 10 వేల 954 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి..
వాటిని మొత్తం డైరెక్ట్ నోటిఫికేషన్ వేస్తారేమో… దాదాపు 11 వేల పోస్టులు నిరుద్యోగులకు దక్కుతాయని ఆశపడ్డారు…
కానీ అది జరగడం లేదు… పాత VRO, VRAలకే ఇవ్వాలని చూస్తోంది…
వాళ్ళేమో ఇప్పుడు చేస్తున్న జాబ్ సుకూన్ గా ఉంది… మళ్ళీ GPO కి ఎందుకు రావాలని రావట్లేదు.

 

2020లో BRS ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఎ వ్యవస్థలను రద్దుచేసింది…
వాళ్ళందర్నీ ఇతర శాఖలకు జూనియర్ అసిస్టెంట్లుగా పంపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామ పాలనాధికారుల (జీపీవో) పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసింది.
దాంతో EX VRO, VRA లను తీసుకుంటే… వాళ్ళకి తెలిసిన వర్క్ కదా…
మాకు ఈజీగా ఉంటుందని రెవెన్యూశాఖ భావించింది…
ఇప్పటికే వేరే పోస్టుల్లో ఉన్నోళ్ళని డైరెక్ట్ గా తీసుకుంటే… లీగల్ ప్రాబ్లెమ్స్ వస్తాయని
వాళ్ళకి తూతూ మంత్రంగా ఓ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటోంది.

ఈ ఏడాది మార్చిలో 10 వేల 954 గ్రామాలకు GPOల భర్తీకి నోటిఫికేషన్ జారీఅయింది..
అందులో 4 వేల 588 మంది ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యారు.
వాళ్ళల్లో 3 వేల 454 మంది మాత్రమే సెలక్ట్ అయ్యారు.
దీంతో మళ్ళీ ఈ జులై నెలలో… రెండోసారి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు.
లాస్ట్ డేట్… మొన్న 16వ తేదీ దాకా… 2 వేల 450 అప్లికేషన్లు వచ్చాయి.

చాలామంది పూర్వపు VRO, VRA లు GPO పోస్టులకు అప్లయ్ చేయట్లేదు…
ఎందుకు అంటే…
రాష్ట్రంలో 5,195 మంది EX VRO, 3,680 మంది డిగ్రీ అర్హత ఉన్న EX వీఆర్ఎలు ఉన్నారు.
జూనియర్ అసిస్టెంట్ కేడర్లో GPO పోస్టులను క్రియేట్ చేశారు.
డిగ్రీ లేదా ఇంటర్ విద్యార్హతతో ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి అవకాశం ఇచ్చారు.
దీంతో 8,875 మంది ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునే అవకాశం ఏర్పడింది.
ఫస్ట్ ఫేజ్ లో ఎంపికైన 3,454 మంది.
సెకండ్ ఫేజ్ లో అప్లయ్ చేసుకున్న 2,450 మందిన
మొత్తం అందరూ సెలక్ట్ అయినా… 5 వేల 904 పోస్టులు మాత్రమే భర్తీ అవుతాయి.
ఇంకా 5 వేల 50 పోస్టులు ఖాళీగా ఉంటాయి.

గ్రామ రెవెన్యూ వ్యవస్థను మళ్ళీ తీసుకొచ్చారు కాబట్టి…
గతంలో VRO, VRAలుగా పనిచేసిన వాళ్ళందర్నీ
డైరెక్ట్ గా GPOలుగా సెలక్ట్ చేస్తారని వాళ్ళు అనుకున్నారు…
కానీ డిగ్రీ, ఇంటర్ క్వాలిఫికేషన్ పెట్టడం… ఓల్డ్ సీనియారిటీని లెక్కలోకి తీసుకోబోమని
రెవెన్యూశాఖ చెప్పడంతో చాలా మంది GPO పోస్టులకు ఆసక్తి చూపట్లేదు.
సరే వాళ్ళ గొడవ అలా ఉంటే…
అసలు ఆ పోస్టులను నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదు
అనే డిమాండ్స్ బాగా వస్తున్నాయి….
ప్రస్తుతం భూభారతి ప్రోగ్రామ్ నడుస్తోంది… కొత్త వాళ్ళకైతే రెవెన్యూ లెక్కలు నేర్చుకోడానికి టైం పడుతుంది…
పాత వాళ్ళయితే ఈజీగా ఉంటుంది… ఎలాంటి తప్పులు జరగవు అని
ప్రభుత్వం భావిస్తోంది… అందుకే రెవెన్యూ సంఘాలు ఎప్పుడు ఏ డిమాండ్ చేసినా
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓకే అంటున్నారు….
కానీ
GPO పోస్టులకు పాతవాళ్ళు రానంటున్నారు…
ఇప్పటికైనా కొత్తగా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా…
డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా కనీసం 5 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినా
కొంతమంది నిరుద్యోగులకు అయినా జాబ్స్ వస్తాయి…
రెవెన్యూ వ్యవస్థ మీద నెలో… రెండో నెలలో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళే ఇంప్రూవ్ అవుతారు కదా…

గ్రూప్ 1,2,3 పోస్టులు, పోలీస్ , ఫారెస్ట్ ఉద్యోగాలకు ఎప్పుడు జాబ్ కేలండర్ ఇస్తారో తెలీదు
ఎప్పుడు నోటిఫికేషన్లు పడతాయో తెలియడం లేదు..
కనీసం… GPO పోస్టులనైనా భర్తీ చేస్తే… నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ మీద నమ్మకం ఏర్పడుతుంది.
మరి గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటుందో చూడాలి…
లేదంటే పాతవాళ్ళకే మీ సర్వీసును కంటిన్యూ చేస్తాం రండి అని పిలిచినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Also read: 🕵️‍♂️ IB ACIO-II Executive పోస్టులకు భారీ నోటిఫికేషన్ – మొత్తం 3,717 ఖాళీలు!

Also read: ఐబీపీఎస్‌లో 6,215 పీఓలు, ఎస్ఓ పోస్టులు : ఇలా ఫాలో అయితే జాబ్ మీదే !

Also read: సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ జాబ్స్ 4500 Posts

Also read: https://sarkariresultz.in/telangana/telangana-grama-palana-officer-notification/

Hot this week

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

Topics

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

🕵️‍♂️ IB ACIO-II Executive పోస్టులకు భారీ నోటిఫికేషన్ – మొత్తం 3,717 ఖాళీలు!

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన Intelligence Bureau (IB)...

ఐబీపీఎస్‌లో 6,215 పీఓలు, ఎస్ఓ పోస్టులు : ఇలా ఫాలో అయితే జాబ్ మీదే !

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ జాబ్స్ 4500 Posts

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా – అప్రెంటీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 మొత్తం...
spot_img

Related Articles

Popular Categories