G-948507G64C
Home Prep Plan Agniveer 🪖 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం + ఇంజనీరింగ్ డిగ్రీ

🪖 ఇంటర్ పూర్తి చేసిన వారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం + ఇంజనీరింగ్ డిగ్రీ

0
12

 

ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES) ద్వారా పర్మనెంట్ కమిషన్ కోసం 54వ కోర్సు (జనవరి 2026 బ్యాచ్) కు సంబంధించి తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపీసీ (Maths, Physics, Chemistry) గ్రూపులో ఇంటర్ పూర్తి చేసిన, అవివాహిత పురుష అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు.


📌 ఖాళీలు: మొత్తం 90 పోస్టులు


🎓 అర్హతలు:

  • గుర్తింపు పొందిన బోర్డులో ఇంటర్మీడియెట్ (10+2) – MPC గ్రూపులో కనీసం 60% మార్కులు పొందాలి.
  • JEE Main 2025 పరీక్షకు హాజరై ఉండాలి.
  • శారీరక ప్రమాణాలు మరియు వైద్య అర్హతలు ఉండాలి.
  • కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
  • వయస్సు: 01.01.2026 నాటికి 16.5 సంవత్సరాలు నుండి 19.5 సంవత్సరాల మధ్య ఉండాలి.

✅ ఎంపిక ప్రక్రియ:

  • దరఖాస్తులను JEE Main స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • అనంతరం SSB (Service Selection Board) ద్వారా:
    • స్టేజ్ 1 & స్టేజ్ 2 టెస్ట్‌లు
    • ఇంటర్వ్యూలు
    • మెడికల్ పరీక్షలు
  • స్టేజ్ 1లో అర్హత సాధించని అభ్యర్థులను అదే రోజు వెనక్కు పంపిస్తారు.
  • మొత్తం ప్రక్రియలో సాధించిన మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

🎓 శిక్షణ వివరాలు:

  • ఎంపికైన అభ్యర్థులకు నాలుగేళ్ల ప్రీ-కమిషన్‌డ్ ట్రైనింగ్ లభిస్తుంది.
  • ఫేజ్ 1: CME పుణె / MCTE మహూ / MCEME సికింద్రాబాద్ లో మూడు సంవత్సరాలు
  • ఫేజ్ 2: IMA డెహ్రాడూన్ లో ఒక సంవత్సరం

💰 స్టైపెండ్ & జీతం:

  • శిక్షణ సమయంలో నెలకు ₹56,100 స్టైపెండ్
  • శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ ర్యాంకు, వార్షిక CTC: ₹17 లక్షలు – ₹18 లక్షల వరకు
  • Pay Level: 10

🎓 ఇంజనీరింగ్ డిగ్రీ:

  • ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇంజనీరింగ్ డిగ్రీ (BE/B.Tech) అందించబడుతుంది.
  • తక్షణమే లెఫ్టినెంట్ పదవితో పర్మనెంట్ కమిషన్ కల్పించబడుతుంది.

📝 దరఖాస్తు వివరాలు:

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 13.05.2025
  • చివరి తేదీ: 12.06.2025
  • SSB ఇంటర్వ్యూలు: ఆగస్ట్ / సెప్టెంబర్ 2025
  • ఆన్‌లైన్ అప్లై లింక్: www.joinindianarmy.nic.in

📣 ముఖ్య సూచనలు:

ఈ నోటిఫికేషన్ యువతకు ఆర్మీలో మంచి ఉద్యోగ అవకాశంతోపాటు ఉచితంగా ఇంజనీరింగ్ డిగ్రీ అందించే అరుదైన అవకాశం.


Read this also: సర్వేయర్ ట్రైనింగ్ లో చేరతారా ?

Read this also :BOB ఆఫీస్ అసిస్టెంట్ Exam ఎలా ? Success Plan (తెలుగులోనే ఎగ్జామ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here