G-948507G64C

తెలంగాణ దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల

 

దోస్త్ 2025 నోటిఫికేషన్ విడుదల – జూన్ 30 నుంచి డిగ్రీ క్లాసులు ప్రారంభం

తెలంగాణలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో కాలేజీ విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ సంయుక్తంగా విడుదల చేశారు.

అడ్మిషన్ వివరాలు: మూడు విడుతలలో సీట్ల భర్తీ

  • దోస్త్ ద్వారా రాష్ట్రంలోని 8 విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.
  • మొత్తం మూడు విడుతల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది.
  • జూన్ 28న కౌన్సెలింగ్ ముగియనుంది.
  • సీట్లు పొంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన అభ్యర్థులు జూన్ 24 – 28 మధ్య కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి.
  • జూన్ 30 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.
  • కాలేజీల్లో ఓరియంటేషన్ ప్రోగ్రాములు జూన్ 24 – 28 మధ్య జరుగుతాయి.

తెలంగాణ విద్యార్థులకు పూర్తిస్థాయి అవకాశం

  • రాష్ట్రంలో మొత్తం 1,057 డిగ్రీ కాలేజీల్లో 4,57,724 సీట్లు ఉన్నాయి.
  • వీటిలో 70 నాన్-దోస్త్ కాలేజీలు ఉండగా, అవి తమ సీట్లను స్వయంగా భర్తీ చేసుకుంటాయి.
  • ఈ ఏడాది నుంచి 100% సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. గతంలో ఉన్న 15% ఏపీ కోటా తొలగించబడింది.
  • కొత్త విధానంలో 95% సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు, మిగిలిన 5% సీట్లు ఇతర రాష్ట్రాల నుంచి స్థిరపడినవారికి లేదా మన రాష్ట్రపు వారిని వివాహం చేసుకున్న వారి పిల్లలకు కేటాయించనున్నారు.

కొత్త నిబంధనలు – దివ్యాంగులకూ న్యాయం

  • దివ్యాంగులకు 5% రిజర్వేషన్ కల్పించనున్నారు.
  • ఎస్సీ వర్గీకరణ ప్రకారం సీట్ల భర్తీ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

దోస్త్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి?

ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు దోస్త్ వెబ్‌సైట్‌ (https://dost.cgg.gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటి విడుత రిజిస్ట్రేషన్లు శనివారం నుంచే ప్రారంభం అవుతాయి.


విద్యార్థులకు సూచన: డిగ్రీ అడ్మిషన్ కోసం ఆసక్తిగలవారు గడువు మిస్ కాకుండా వెంటనే దోస్త్ వెబ్‌సైట్‌ సందర్శించి నమోదు చేసుకోవాలి.


ఇది కూడా చదవండి : వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర

ఇది కూడా చదవండి : సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఫైనాన్స్ లో పోస్ట్లు

Hot this week

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

Topics

🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్

  🏦 IBPS భారీ ఉద్యోగ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా 10,277 క్లర్క్‌ పోస్టులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...

🏦 ఎస్‌బీఐలో భారీ ఉద్యోగావకాశం!

6,589 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల స్టేట్ బ్యాంక్ ఆఫ్...

🔥 బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)లో 330 ఉద్యోగాలు – పూర్తి వివరాలు

ఈ నోటిఫికేషన్ యువతకు మంచి అవకాశంగా చెప్పొచ్చు, ముఖ్యంగా టెక్నాలజీ, ఫైనాన్స్,...

🌳 APPSC Forest Beat Officer Notification 2025 విడుదల! Imp Tips

691 పోస్టులు – ఇంటర్ అర్హతతో సర్కార్ ఉద్యోగం కోరికను నిజం...

రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు లేవు…

అడిగినోళ్ళకి కొలువులు ఇయ్యరు వద్దన్నోళ్ళకి పిలిచి ఇస్తున్నరు ఇదేం సంస్కృతి రేవంతన్నా ? జాబ్ కేలండర్...

🕵️‍♂️ IB ACIO-II Executive పోస్టులకు భారీ నోటిఫికేషన్ – మొత్తం 3,717 ఖాళీలు!

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన Intelligence Bureau (IB)...

ఐబీపీఎస్‌లో 6,215 పీఓలు, ఎస్ఓ పోస్టులు : ఇలా ఫాలో అయితే జాబ్ మీదే !

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...
spot_img

Related Articles

Popular Categories