UPSC Civils Exam New Rule: సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి అప్లయ్ చేస్తున్న వారికి UPSC కొత్త రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి అప్లయ్ చేసే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ ముందే submit చేయాల్సి ఉంటుంది.
Table of Contents
గతంలో Civils Prelims పరీక్షలో అర్హత సాధించిన తర్వాత అభ్యర్థులు తమ Age, Caste Certificates సమర్పించేవారు. కానీ 2025 UPSC Civils కి అప్లయ్ చేసేవారికి కొత్త రూల్స్ అప్లయ్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. IAS ప్రొబేషనరీ ఆఫీసర్ పూజా ఖేద్కర్ తప్పుడు OBC, Medical Certificates సమర్పించి, దివ్యాంగుల కోటాలో IASకు ఎంపికైనట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన తర్వాత ఆమెను సస్పెండ్ చేయడం, సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఇలాంటి పరిస్థితులు మళ్ళీ తలెత్తకుండా ఇక ముందు ప్రిలిమినరీ పరీక్షకు ముందే ఆ డాక్యుమెంట్స్ సమర్పించాలని కొత్త రూల్ తీసుకొచ్చింది.
ఏ డాక్యుమెంట్స్ కావాలంటే !
సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రూల్స్-2025 ప్రకారం,’ Civil Services పరీక్షకు ఆన్లైన్లోనే అప్లయ్ చేయాలి. అప్లికేషన్లో పుట్టిన తేదీ, కులం లేదా వర్గం (SC, ST, OBC, EWS, దివ్యాంగులు, Ex-Servicemen), విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్లను మెన్షన్ చేయాలి. వాటిని రుజువు చేసే documents కచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్ తో పాటు ఈ documents సమర్పించకపోతే అభ్యర్థిత్వం రద్దు చేస్తామని UPSC నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
2025 Civil Services preliminary exam మే 25న నిర్వహించనుంది. ఈ పరీక్షతో దాదాపు 979 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో దివ్యాంగులకు 38 పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు http://upsconline.gov.in వైబ్సైట్లో అప్లయ్ చేసుకోవాలి. 2025 ఫిబ్రవరి 11 సాయంత్రం 6 గంటల వరకు అప్లయ్ చేసుకోవడానికి అవకాశముంది.
Telangana Exams -Whats Group Channel – CLICK below
ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams