తెలంగాణలో 8 వేలకు పైగా గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సహాయకుల నియామకంపై ప్రభుత్వం ఈ నెలలోనే నిర్ణయం తీసుకోబోతోంది. ఈనెల 9 నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టబోతోంది. బిల్లు చట్టంగా రూపొందగానే జనవరి 2025లో కొత్త జాబ్ కేలండర్ ద్వారా 8 వేలకు పైగా VRO పోస్టులను భర్తీ చేయనుంది.
ఇది కూడా చదవండి : JRO VRO ఎగ్జామ్ ఎలా ఉండొచ్చు ?
కొత్త రెవెన్యూ చట్టంలోనే VRO పోస్టులు
ఈనెల 9 నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు ROR బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతోంది. గతంలో గ్రామాల్లో పనిచేసిన గ్రామ రెవన్యూ అధికారి (VRO), గ్రామ సహాయకుడు (VRA)ల లాగే కొత్త పోస్టులను క్రియేట్ చేయబోతోంది. దానికి ఏం పేరు పెడతారన్నది నాలుగైదు రోజుల్లో తేలిపోతుంది. తెలంగాణలో మొత్తం 10,909 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటన్నంటికీ VRA/VRO తరహా పోస్టులు అవసరం ఉంది. అయితే గతంలో ఈ పోస్టుల్లో పనిచేసిన 3 వేల మందికి తిరిగి ఆయా గ్రామాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వీళ్ళు కాకుండా మిగిలిన 8000 దాకా పోస్టులను TGPSC ద్వారా Direct Recruitment ద్వారా నియామకాలు చేపడుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ROR బిల్లులో ఉన్నాయి.
VRO పోస్టులకు అర్హతలు ఏంటి ? వయస్సు ఎంత ?
తెలంగాణాలో 8000 దాకా విలేజ్ రెవెన్యూ అధికారులను ప్రభుత్వం నియమించబోతోంది. ఈ పోస్టులను TGSPSC ద్వారా భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరి 2025లో వెలువడే అవకాశం ఉంది. ఈ పోస్టులకు 18 నుంచి 44 యేళ్ళ మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. వివిధ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అలాగే ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం ఉంటుంది.
మొత్తం పోస్టులు ఎన్ని ?
VRO పోస్టులు మొత్తం 8000 దాకా ఉంటాయి
వయస్సు:
18 నుంచి 44 యేళ్ళ మధ్య వయస్సు కలిగిన వారికి అవకాశం. SC, ST, OBC, అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10యేళ్ళ పాటు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు ?
గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం TGPSC ద్వారా రాత పరీక్షను నిర్వహిస్తుంది. ఇందులో గతంలో లాగే
1) General Knowledge – 75 Marks
2) Secretarial Abilities – 75 Marks
కి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్… సిలబస్ లో ఏయే టాపిక్స్ ఉంటాయి అన్నది ఈ కింది లింక్ ద్వారా తెలుసుకోగలరు
https://telanganaexams.com/jro-vro-notification-exam-pattern/
శాలరీ వివరాలు:
గ్రామ రెవెన్యూ అధికారులుగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹30,000/- వరకు జీతం ఉంటుంది. ఇవి కాకుండా TA, DA, HRA లాంటి అలవెన్సులు కూడా ఉంటాయి.
నోటిఫికేషన్ ఎప్పుడు ?
డిసెంబర్ 9 నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ROR బిల్లుతో పాటు గ్రామ రెవెన్యూ అధికారుల నియామకంపై బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. సభలో ఆమోదం తర్వాత గవర్నర్ సంతకంతో కొత్త ROR చట్టం రెడీ అవుతుంది. ఆ తర్వాత 2025 జనవరిలో ప్రకటించే కొత్త జాబ్ కేలండర్ లో 8000 గ్రామ రెవెన్యూ అధికారుల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఉంటాయి.
ముఖ్య గమనిక: గ్రామాల్లో రెవెన్యూ అధికారుల వ్యవస్థ చాలా అవసరంగా ఉంది. అందుకే నియామకాలు చాలా త్వరగానే చేపట్టే అవకాశం ఉంది.
విద్యార్హతలు ఏంటి ?
ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉంటుంది. VRA పోస్టులు ఉంటే ఇంటర్, VROలకు డిగ్రీ ఉండే అవకాశం.
లేదా
గ్రేడ్ 1 రెవెన్యూ గ్రామాల్లో (పెద్ద గ్రామాలు) డిగ్రీ అర్హత కలిగిన వారిని, గ్రేడ్ 2 రెవెన్యూ గ్రామాలకు (చిన్న గ్రామాలు) ఇంటర్ అర్హత కలిగిన వారిని నియమించే అవకాశం ఉంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్హతలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
CLICK HERE : VRO ఎగ్జామ్ ఎలా ఉంటుంది?
VRO/ JRO TEST SERIES
మీకు Telangana Exams plus ఈ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. కోర్సులో జాయిన్ అయ్యే ముందు test series లో ఇచ్చిన సూచనలు తప్పకుండా చదవండి…
VRO/JRO 2025 Test Series COURSE LINK : CLICK HERE
6 నెలలకు 250 రూపాయలు
ఏడాదికి 450 రూపాయలకు కోర్సు అందుబాటులో ఉంది. జాయిన్ అవ్వండి.
ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.
🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK
Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams