• అమెరికా ప్రయోగించిన ‘ది ఎక్స్-37 బీ ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ 908 రోజుల తర్వాత ఫ్లోరిడాలో నాసాకు చెందిన కెన్నెడి స్పేస్ సెంటర్లో ల్యాండ్ అయింది.
  • అమెరికాకు చెందిన స్పేస్ ఫోర్స్ ఈ సీక్రెట్ వెహికిల్ ను 2020 మే నెలలో ప్రయోగించింది. ఈ స్పేస్ వెహికల్ ను బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసింది.
  • గతంలో కక్ష్యలో గడిపిన 780 రోజుల రికార్డును ఈసారి బద్దలు కొట్టింది. యాత్ర దేనికి సంబంధించినది అన్నది స్పేస్ ఫోర్స్ బయటపెట్టలేదు. ఈసారి ఇందులో పేలోడ్ సంఖ్యను పెంచేలా సర్వీస్ మాడ్యూల్ ను కూడా తీసుకెళ్లింది.
  • అంతరిక్షంలో ఆర్బిటల్ టెస్ట్ వెహికల్ నుంచి ఈ మాడ్యూల్ విడిపోయి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అమెరికా నేవల్ రీసెర్చి పరిశోధనలకు అవసరమైన ప్రయోగాలు చేశారు. థర్మల్ కంట్రోల్ కోటింగ్స్, ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్, రేడియేషన్ షీల్డింగ్ మెటీరియల్ లాంటి వాటితో అంతరిక్షంలో పదార్థాల, సాంకేతికత పనితీరుపై పరీక్షలు చేశారు.
  • ఎక్స్-37 బీకి ఇది ఆరో అంతరిక్ష యాత్ర గా చెప్పవచ్చు. ఈ ప్రయాణంలో మొత్తం 3 బిలియన్ మైళ్ల దూరం ప్రయాణించింది.
  • మొత్తం 3,774 రోజులు అంతరిక్షంలో గడిపింది.

Leave a Reply