G-948507G64C

6000 పోస్టులతో DSC

తెలంగాణలో 6 వేల టీచర్ పోస్టులతో DSC వేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. TET (Teacher Eligibility Test) పరీక్షలు అయిపోవడంతో DSC వేయడానికి విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2024లో కూడా TET నిర్వహించిన వెంటనే DSC నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మెగా DSC వేస్తామని ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. గత BRS గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులకు అదనంగా 5 వేలు కలిపి మొత్తం 11 వేలకు పైగా పోస్టులకు రేవంత్ సర్కార్ DSC ఎగ్జామ్ నిర్వహించింది. మరో DSC వేస్తామని అప్పట్లోనే సీఎంతో పాటు మంత్రులు ప్రకటించారు. ఫిబ్రవరిలో DSC నోటిఫికేషన్ వేస్తామని ఈమధ్య కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

Read this Also : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : తెలంగాణలో కొత్త కొలువులు

DSC Exams

పోస్టులు తగ్గుతాయా ?

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలో ఏర్పడిన ఖాళీలకు వీటిని కూడా యాడ్ చేస్తారా లేదా అన్నది చూడాలి. ఆ ఖాళీలు కూడా లెక్కపెడితే 6 వేలు పోస్టులు ఉంటాయి. అప్పుడు మొత్తం పోస్టులకు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని ఉపాధ్యా నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి టీచర్ల Rationalization ప్రక్రియ చేపడతారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ఆ ప్రక్రియ చేపడితే పోస్టులు భారీగా తగ్గే అవకాశముందని అంటున్నారు. SC రిజర్వేషన్లపై ఏర్పాటుపై ఏక సభ్య కమిటీ నివేదిక వచ్చాకే SC కోటా అమలుపై నిర్ణయం తీసుకుంటారు. మరి ఆ నివేదిక రాకముందే నోటిఫికేషన్ వేసి… టీచర్ పోస్టులు భర్తీ చేసేటప్పుడు SC కమిషన్ రిపోర్టు ప్రకారం రిజర్వేషన్లను అమలు చేస్తారా? అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

6 నెలలకోసారి TET

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 2 సార్లు TET నిర్వహించింది. ఒక DSC ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసింది. ఇక ముందు 6 నెలలకోసారి TET నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. విద్యాశాఖలో ఖాళీలు ఏర్పడిన వెంటనే ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈనెల 2వ తేదీ నుంచి 20 వరకు టెట్ పరీక్షలు పూర్తయ్యాయి. CBT విధానంలో 2 సెషన్లలో ఎగ్జామ్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా TETకు 2,75,753 అప్లికేషన్లు వచ్చాయి. పరీక్షలకు 2,05,278 మంది హాజరయ్యారు. టెట్ ఎగ్జామ్స్ కి 74.44 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. TET Preliminary Key ఈనెల 24న విడుదల చేస్తున్నారు.

అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ISMS/ లింక్ ద్వారా ఈ నెల24 నుంచి 27 వరకు ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలను తెలవపచ్చు.

CLICK HERE 

Telangana Exams plus యాప్ లో నిర్వహించే TGPSC Group.1,2 & 3 తో పాటు VRO, HIGH COURT JOBS etc., Test Series లో పాల్గొనడానికి ఇప్పుడే ఈ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి

ఉద్యోగ, విద్యా సమాచారం కోసం ఈ కింది లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి.

🎯 ఎగ్జామ్స్ సెంటర్ CLICK HERE FOR TELEGRAM LINK

🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK

Subscribe తెలంగాణ ఎగ్జామ్స్ Channel : https://www.youtube.com/@TelanganaExams

Hot this week

తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో...

🏢 NPCILలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – మొత్తం 400 ఖాళీలు!

for English Version : CLICK HERE 🏢 NPCIL, ముంబైలో ఎగ్జిక్యూటివ్...

NMDC లో 179 అప్రెంటిస్ పోస్టులు

FOR ENGLISH VERSION : CLICK HERE ఎన్ఎండీసీలో 179 అప్రెంటిస్ పోస్టుల...

పశుసంవర్ధక శాఖలో 354 పోస్టుల భర్తీ

▪ త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ▪ వీఏలకు లైవ్ స్టాక్...

ADAలో 133 ఖాళీలు

Aeronautics Jobs2025 : ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ)లో ఉద్యోగాల భర్తీకి...

Topics

తెలంగాణలో గ్రూప్ 1 నియామకాలకు బ్రేక్

FOR ENGLISH VERSION : CLICK HERE TGPSC Group.1 : తెలంగాణలో...

🏢 NPCILలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ – మొత్తం 400 ఖాళీలు!

for English Version : CLICK HERE 🏢 NPCIL, ముంబైలో ఎగ్జిక్యూటివ్...

NMDC లో 179 అప్రెంటిస్ పోస్టులు

FOR ENGLISH VERSION : CLICK HERE ఎన్ఎండీసీలో 179 అప్రెంటిస్ పోస్టుల...

పశుసంవర్ధక శాఖలో 354 పోస్టుల భర్తీ

▪ త్వరలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీ▪ వీఏలకు లైవ్ స్టాక్...

ADAలో 133 ఖాళీలు

Aeronautics Jobs2025 : ఏరోనాటిక్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ)లో ఉద్యోగాల భర్తీకి...

GPO నియామకాలపై కన్ ఫ్యూజన్

గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు గతంలో VRO, VRA లకు...

🔴 DRDO GTRE Jobs 2025: బెంగళూరులో 150 Graduate, Diploma, ITI Apprentice Vacancies – Apply Now

  🔴 DRDO GTRE Jobs 2025: బెంగళూరులో 150 Graduate, Diploma,...

🔴 ESIC Jobs 2025: దిల్లీలో 558 స్పెషలిస్ట్ Govt Doctor Jobs – Apply Now!

  🔴 ESIC Jobs 2025: దిల్లీలో 558 స్పెషలిస్ట్ Govt Doctor...
spot_img

Related Articles

Popular Categories