VRO కు బదులు 5వేల జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

VRO కు బదులు 5వేల జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

రెవెన్యూ శాఖలో వీఆర్వోల వ్యవస్థను ప్రభుత్వం గతంలో రద్దు చేసింది. ఆ స్థానంలో 5 వేల జూనియర్ అసిస్టెంట్స్ ను నియమించుకొని రెవెన్యూ శాఖలో యువతను రిక్రూట్ చేసుకోవాలి ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపారు. జోనల్ వ్యవస్థ సర్దుబాటు అయ్యాక ప్రస్తుతం రెవెన్యూశాఖలో మిగిలిన 5,485 మందికి వివిధ శాఖల్లో బాధ్యతలను అప్పగించనున్నారు. వీళ్ళల్లో 85శాతం మందిని వివిధ శాఖలకు పంపాలని నిర్ణయించారు. సబ్ రిజిస్ట్రార్ హోదాలో మండల రెవెన్యూ అధికారులకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను అప్పగించింది. దాంతో ఈ పనులతో పాటు వివిధ ధృవీకరణ పత్రాల జారీ, ప్రభుత్వ పథకాల పనులు, జిల్లా కలెక్టర్ ప్రోటోకాల్ విధులు, ప్రకృతి వైపరీత్యాల సమంలో విధులు లాంటి పనులు ఎన్నో రెవెన్యూ శాఖకు భారంగా మారాయి. ప్రస్తుత అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రతి మండలానికి కనీసం 10 మంది జూనియర్ అసిస్టెంట్స్ అవసరమని రెవెన్యూ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కనీసం 1800 మందిని తీసుకోవాలని ముందుగా భావిస్తున్నా... అవసరాన్ని బట్టి ఈ సంఖ్య 5 వేల దాకా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో 5 వేల జూనియర్ అసిస్టెంట్ పోస్టులను రెవెన్యూ శాఖలో భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ కోర్సు ఫాలో అయితే మీకు ఉద్యోగం ఎందుకు రాదు ?  http://telanganaexams.com/3months-course/

Telangana Exams Plus యాప్ డౌన్లోడ్ చేసుకోడానికి లింక్ https://play.google.com/store/apps/details?id=co.lynde.atvqp

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true

SOURCE : EENADU