Microsoft చెప్పిన 40 ఉద్యోగాల జాబితా – మీది ఉందా?
AI అంటే Artificial Intelligence. ఇది మన జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. కానీ… కొంతమంది ఉద్యోగులకు ఇది ప్రమాదం కూడా అవుతోంది. Microsoft, OpenAI, LinkedIn కలిసి చేసిన తాజా అధ్యయనం ప్రకారం, 40 ఉద్యోగాలు AI వల్ల డేంజర్‌లో ఉన్నాయి.
“AI అంటే ChatGPT లాంటి టూల్స్, ఇవి మనం రాసే, చదివే, మాట్లాడే పనులను చాలా వేగంగా చేస్తాయి. అందుకే, టెలిఫోన్ మార్కెటింగ్, టీచర్లు, జర్నలిస్టులు, కాల్ సెంటర్ ఉద్యోగులు వంటి white-collar jobs ఎక్కువగా ప్రభావితమవుతాయి.
ఇంకా ప్రభావితమయ్యే ఉద్యోగాలు:
- కస్టమర్ సర్వీస్
- సైకాలజిస్టులు
- న్యాయమూర్తులు
- సోషియాలజిస్టులు
- న్యూస్ అనలిస్టులు
- ట్రాన్స్లేటర్లు
- ప్రూఫ్ రీడర్లు
- కాపీ రైటర్లు
- ఎడిటర్లు
- HR స్పెషలిస్టులు
- మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు
ఈ ఉద్యోగాలు ఎక్కువగా టెక్స్ట్ ప్రాసెసింగ్, అనాలిసిస్, రిపోర్టింగ్ మీద ఆధారపడతాయి. AI ఇవన్నీ చాలా వేగంగా, ఖచ్చితంగా చేయగలదు.
But Wait! ఎవరి ఉద్యోగం సేఫ్?
“AI కి ఇంకా చేతితో చేసే పనులు, ఫిజికల్ స్కిల్స్ అవసరమయ్యే ఉద్యోగాలు చేయడం కష్టం. అందుకే క్లీనర్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, డ్రైవర్లు, మెకానిక్స్, ప్లంబర్లు, బేకర్లు, మాసన్లు, టైలర్లు వంటి occupations చాలా సేఫ్.”
Conclusion:
“ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక గైడెన్స్ కూడా. మనం AI నేర్చుకోవాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. Google, Microsoft లాంటి కంపెనీలు AI tools నేర్చుకోవడానికి కోర్సులు కూడా ఇస్తున్నాయి.
మీరు జర్నలిస్టా? టీచరా? అయితే, ఇప్పుడు AI తో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. AI ని భయపడకుండా, దాన్ని మన పనిలో భాగం చేసుకోవాలి.”
“ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడితే, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ occupation ఈ జాబితాలో ఉందా? AI గురించి మరిన్ని ఆర్టికల్స్ తెలుగులో అందిస్తాం. రెగ్యులర్ గా www.telanganaexams.com వెబ్ సైట్ విజిట్ చేయండి.