స్వాతంత్ర్య సమరంలో సామాన్యులపై పుస్తకం: ‘ది లాస్ట్ హీరోస్’ లో 15 మంది వీరుల గాథలు

 • దేశ స్వాతంత్య్ర సమరంలో పోరాడిన అజ్ఞాత వీరుల జీవిత గాధలను ఈనాటి తరానికి తెలియజేస్తూ ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ ‘ది లాస్ట్ హీరోస్: ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం పేరుతో రాసిన పుస్తకంను 2022 నవంబర్ 28న ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు.
 • వీర వనిత మల్లు స్వరాజ్యంతోపాటు దేశంలో 15 మంది యోధుల జీవితాల గురించి ఇందులో రాశారు.
 • పుస్తకంలో దళితులు, ఆదివాసీలు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, రైతులు, కార్మికులు, వంటవాళ్లు, సాధారణ మహిళల గురించి వెలుగులోకి తెచ్చారు సాయినాథ్.
 • స్వతంత్రతా సైనిక్ సమ్మాన్ యోజన పేరుతో ఉన్న పింఛను స్కీంలో స్వాతంత్య్ర్య సమరయోధులపై చెప్పిన నిర్వచనం తప్పనీ… దాంతో నిజమైన సమరయోధులు, మహిళలకు ప్రయోజనాలు దక్కలేదని సాయినాథ్ అభిప్రాయం. ఈ పుస్తకంలో ఐదుగురు మహిళల గురించి రాశారు.
 • ప్రస్తుత పుస్తకాల్లో స్వాతంత్రోద్యమం అంతా ఉత్తర ప్రదేశ్, బిహార్ లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనే జరిగినట్లు అనిపిస్తుంది.
 • దక్షిణాదిలో తెలంగాణకు చెందిన మల్లు స్వరాజ్యం, తమిళనాడుకు చెందిన ఎన్. శంకరయ్య, ఆర్. నల్లకన్నుల గురించి ఇందులో చెప్పారు.
 • భగత్ సింగ్ జుగ్గియాన్, బాజీ మొహమ్మద్, లక్ష్మి పండా, గణపతి. యాదవ్, బాబాని మహతో, హెచ్ఎస్ దొరెస్వామి లాంటి వారి చరిత్రలను రాశారు.

BCCIకు గిన్నిస్ రికార్డు

 • BCCIకు టీ20 మ్యాచ్ లో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరైన విషయంలో ప్రపంచ రికార్డు దక్కింది.
 • 2022 మే 29న ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన IPL పైనల్ ను 1,01,566 మంది ప్రత్యక్షంగా చూశారు. ఇది గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.
 • గిన్నిస్ ప్రపంచ రికార్డును కార్యదర్శి జై షా స్వీకరిస్తున్న ఫొటోను BCCI ట్వీట్ చేసింది.
 • IPL ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ గెలిచింది.

 

14న UNO హెడ్డాఫీస్ ముందు మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ

 • వచ్చేనెలలో లండన్ లోని ఐక్యరాజ్య సమితి (ఐరాస) హెడ్డాఫీస్ దగ్గర మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.
 • ఐరాస భద్రతామండలికి భారత్ అధ్యక్షత వహిస్తుండటంతో ఈ విగ్రహం ఏర్పటవుతోంది.
 • ప్రముఖ భారత శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ్ సుతార్ దీన్ని రూపొందించారు. గుజరాత్లోని ఐక్యతా విగ్రహాన్ని తయారు చేసింది కూడా ఇతనే.
 • విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ UNO పర్యటనకు వస్తున్న సందర్భంగా 2022 డిసెంబరు 14న గాంధీజీ ప్రతిమను ఆవిష్కరిస్తారని UNO రాయబార కార్యాలయం భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ తెలిపారు.
 • భారత్ అందించిన ఈ గాంధీజీ విగ్రహాన్ని మొదటిసారి ఏర్పాటు చేస్తున్నారు. వివిధ దేశాలు పంపిన బహుమతులు, కళాకృతులను ఇలా UNO దగ్గర ఏర్పాటు చేస్తుంటారు.
 • గతంలో భారత్ 1982 జులై 26న అందించిన సూర్యభగవానుడి (11వ శతాబ్దపు నల్లరాతి) విగ్రహం మాత్రమే UNO హెడ్డాఫీస్ దగ్గర ఏర్పాటు చేశారు.
 • గాంధీజీ విగ్రహ ఆవిష్కార కార్యక్రమానికి భద్రతామండలికి చెందిన 15 సభ్యదేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది.

భారత ఒలింపిక్ సంఘం ప్రెసిడెంట్ గా పీటీ ఉష!

 • భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పరుగుల రాణి PT ఉష ఎన్నిక కాబోతోంది. ఈ పదవికి డిసెంబర్ 10న ఎన్నికలు జరగాలి. ఉష మాత్రమే నామినేషన్ వేయడంతో ఆమె ఏకగ్రీ వంగా ఎన్నికవనుంది.
 • IOA అధ్యక్ష పదవిని చేపట్టే మొదటి మహిళ ఉష అవుతుంది. మహారాజా యాదవీంద్ర సింగ్ (1934 క్రికెట్) తర్వాత ఈ బాధ్యతలు స్వీకరించబోతున్న తొలి స్పోర్ట్స్ పర్సన్ కూడా ఉషనే.
 • 1994 ఒలింపిక్స్ లో 100 మీటర్ల హర్డిల్స్ లో సెకనులో వందో వంతులో పతకం చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచింది ఈ పయ్యాలీ ఎక్స్ ప్రెస్.
 • 1982, 1994 ఆసియా క్రీడల్లో 100, 200 మీటర్ల పరుగులో రెండు చొప్పున బంగారు పతకాలు గెలుచుకుంది.
 • ఆసియా చాంపియన్షిప్ లో 14 స్వర్ణాలు సహా మొత్తం 23 పతకాలు గెలుచుకుంది.
 • 1980 ఆసియా చాంపియన్షిప్ లో 5 స్వర్ణాలు సహా 6 పతకాలతో సంచలనంగా నిలిచింది.
 • ఉషతోపాటు ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ (ఉపాధ్యక్షుడు), అజయ్ పటేల్ (సీనియర్ ఉపాధ్యక్షుడు) ఎన్నికవుతారు.

 

ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ తో పాటు ప్రతి రోజూ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఈ కింది లింక్ ద్వారా కేవలం రూ.100తో కోర్సును ఈ కింది లింక్ ద్వారా purchase చేయండి.

https://atvqp.courses.store/114635?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

Leave a Reply