Sunday, February 23

25 DEC CURRENT AFFAIRS QUZI ( TS & AP)

వెబ్ సైట్ లో ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోగలరు

25 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. భారత త్రివిధ దళాలను సమన్వయం చేసేందుకు వీలుగా త్రివిధ దళాల అధిపతి ( CDS) పదవిని సృష్టించాలని 2019 డిసెంబర్ 24న జరిగిన కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు.  ఈ ఆలోచన ఏ యుద్ధం టైమ్ లో వచ్చింది ?

2. ) బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఈ కింది ప్రకటనల్లో ఏవి సరైనవి

1) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంపద ఈ ఏడాది మరో 22.4 బిలియన్ డాలర్లు పెరిగి 113 బిలియన్ డాలర్లకు చేరింది

2) రెండో స్థానంలో ఉన్న అమెజాన్ CEO జెఫ్ బెజోస్ సంపద 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది

3) రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సంపద విలువ 16.5 బిలియన్ డాలర్ల మేర పెరిగింది (దాదాపు రూ.1.2 లక్షల కోట్లు )

4) దాదాపు 61 బిలియన్ డాలర్ల నికర విలువతో ( దాదాపు 4.3 లక్షల కోట్లు) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 12వ స్థానంలో నిలిచాడు

3. గత పదేళ్ళ అంతర్జాతీయ ప్రదర్శనను లెక్కలోకి తీసుకుంటూ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో ఈ దశాబ్దపు టెస్ట్, వన్డే జట్లను ప్రకటించింది.  ఇందులో వన్డే, టెస్ట్ క్రికెట్ కెప్టెన్లు గా ఎవరు ఎంపికయ్యారు ?

4. హిమాచల్ ప్రదేశ్ లోని అత్యంత వ్యూహాత్మక సొరంగ మార్గమైన రోహ్ తంగ్ కి ఎవరి పేరు పెట్టాలని కేంద్ర రక్షణ శాఖ నిర్ణయించింది ?

5. భారత వైమానిక దళంలో బహదూర్ గా పిలిచే ఏ యుద్ధ విమానాలను (కార్గిల్ యుద్ధంలో సత్తా చాటిన) 2019 డిసెంబర్ 27న వీడ్కోలు పలకాలని నిర్ణయించారు ?

6. 2019 డిసెంబర్ 25న కేంద్ర కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

1) 2021 జనాభా లెక్కల సేకరణకు రూ.12,700 కోట్లు కేటాయించింది

2) ఇందులో జాతీయ జనాభా పట్టిక ( NPR) కోసం రూ.3,941 కోట్లను కేటాయించింది

3) ఇందులో జనగణనకు రూ. 8754 కోట్లు ఖర్చు చేస్తారు.

4) జనాభా లెక్కల ప్రక్రియను 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ వరకూ కొనసాగిస్తారు

7. ఇటీవల వార్తల్లోకి వచ్చిన షహీద్ బెహెస్తీ పోర్ట్ ఏ దేశంలో ఉంది ?

8. భారత టెన్నిస్ స్టార్, ఆరు గ్రాండ్ స్లామ్ ల విజేత సానియా మీర్జా ఫెడ్ కప్ టీమ్ లో ఇండియా తరపున ఆడనుంది.  చివరి సారిగా ఫెడ్ కప్ టీమ్ లో ఎప్పుడు  పాల్గొన్నది ?

9. ICC నంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్ మన్ గా 2019 సంవత్సరాన్ని టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముగిస్తున్నాడు. తాజా ర్యాంకింగ్స్ లో ఎన్ని పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు

10. 2020 సంవత్సరాన్ని ఏ ఏడాదిగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ?