నౌకాదళంలోకి రెండో విధ్వంసక నౌక వై 12705
- ‘ప్రాజెక్టు 15 బి’లో భాగంగా మజ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన రెండో విధ్వంసక నౌక 2022 నవంబర్ 24 నాడు భారత నౌకాదళంలోకి చేరింది.
- Y12705 (మొర్ముగావ్)గా పిలిచే ఈ నౌకలో బ్రహ్మోస్ క్షిపణులు, దేశీయ టార్పెడో ట్యూబ్ లాంచర్లు, యాంటీ సబ్ మెరైన్ రాకెట్ లాంచర్లు మోహరించడానికి అవకాశం ఉంది.
- శత్రువులు రాడార్లకు చిక్కకుండా రహస్యంగా పనిచేసే సామర్థ్యం ఈ నౌకకు ఉంది.
- Y12705 నౌక పొడవు 153 మీటర్లు. వెడల్పు 17 మీటర్లు. బరువు 7,400 టన్నులు.
- 2011లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో భాగంగా మజ్ గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నాలుగు నౌకలను తయారు చేస్తోంది. మొదటి నౌక 2021లోనే విశాఖప ట్నంలో భారత నౌకాదళంలో చేరింది.
ALSO READ :
GROUP 2 , 3 నోటిఫికేషన్లకు అంతా సిద్ధం
https://telanganaexams.com/group-2-3-notifications-ready/
మలేసియా కొత్త ప్రధానిగా అన్వర్
- మలేసియాలో జరిగిన ఎన్నికల్లో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. దాంతో రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా… పార్లమెంటు సభ్యులతో సంప్రదించి 75 ఏళ్ల అన్వర్ తో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అన్వర్ సంస్కరణవాదిగా పేరుంది.
- అన్వర్ పార్టీ అలయన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు సాధించింది. మొత్తం 222 సీట్లున్న మలేసియా పార్లమెంటులో మెజారిటీ కావాలంటే 112 సీట్లు రావాలి.
- మితవాది అయిన మాజీ ప్రధాని ముహియుద్దీన్ యాసిన్ పార్టీ నేషనల్ ఆలయన్స్ కి 73 సీట్లు వచ్చాయి.
- 20 ఏళ్ల పాటు ప్రతి పక్షంలో ఉండి, జైలు శిక్షలు అనుభవించి, సంస్కరణల కోసం గట్టిగా నిలబడిన అన్వర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో మలేసియాలో స్టాక్ మార్కెట్ సూచీలు, మలేసియా కరెన్సీ విలువ పెరిగాయి.
పారా షూటర్లకు పతకాలు
- ప్రపంచ పారా షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత షూటర్లు 3 స్వర్ణాలు సహా 5 పతకాలను గెలుచుకున్నారు.
- UAEలో జరిగిన పోటీల్లో పట్టికలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 20 పతకాలతో దక్షిణ కొరియా మొదటి స్థానంలో నిలిచింది.
- 2019లో 3 కాంస్యాలు నెగ్గింది. ఇప్పుడు పారా షూటర్లు దాన్ని అధిగమించారు.
- టీమ్ విభాగాల్లో 3 స్వర్ణాలు, ఓ రజతం వచ్చాయి. రాహుల్ ఒక్కడే వ్యక్తిగత (పీ3 మిక్సిడ్ 25 మీ. పిస్టల్ ఎస్పాచ్1 ఫైనల్స్లోలో కాంస్యం) పతకం సాధించాడు.
- పీని టీమ్, పీప్ మిక్స్ 10మీ. ఎయిర్ పిస్టల్ స్టాండర్స్ ఎస్చ్1, పీ1 పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ ఎస్ హెచ్1లో బంగారు పతకాలు దక్కాయి
ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ తో పాటు ప్రతి రోజూ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఈ కింది లింక్ ద్వారా కేవలం రూ.100తో కోర్సును ఈ కింది లింక్ ద్వారా purchase చేయండి.