
ప్రపంచంలో ప్రతి 11 నిమిషాలకో మహిళ హత్య: కుటుంబసభ్యులే కారణమన్న UNO
- ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై తీవ్ర మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
- సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లో ప్రతి 11 నిమిషాలకో మహిళ లేదా బాలిక హత్యకు గురవుతోంది.
- నవంబరు 25న మహిళలపై హింస నివారణ దినోత్సవం సందర్భంగా ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రిపోర్టు వెల్లడించారు.
- కొవిడ్-19 మహమ్మారి తర్వాత కుటుంబంలో ఆర్థిక ఒత్తిళ్లతో మహిళలపై శారీరక హింస, తిట్లు పెరిగాయని తెలిపారు. ఆన్లైన్ లోనూ వారిపై హింస జరుగుతోందని తెలిపారు.
- వేధింపులకు గురైన బాధితులకు న్యాయం, మద్దతు అందించాలని గుటేరస్ సూచించారు.
- 2035 నాటికి మహిళా హక్కుల సంఘాలు, ఉద్యమాలకు ప్రభుత్వాలు 50 శాతం నిధులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
2022-23లో భారత్ వృద్ధి 6.6%: OECD అంచనా
- ప్రస్తుత భారత్ 6.6 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని Organisation for Economic Cooperative and Development (OECD) అంచనా వేసింది.
- ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంటుందని తెలిపింది.
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్లో అయినా భారత్ మాత్రం ఈ హోదాను నిలబెట్టుకుంటుందని OECD తెలిపింది.
- G20 దేశాల్లో సౌదీ అరేబియా తర్వాత భారతే అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది.
- 2023-24లో భారత్ వృద్ధి 5.7 శాతానికి స్లోడౌన్ అవుతుంది. ఎగుమతులతో పాటు దేశీయంగా గిరాకీ తగ్గడంమే ఇందుక్కారణం
- 2024-25 లో వృద్ధి రేటు తిరిగి 7 శాతానికి పుంజుకుంటుందని OECD రిపోర్ట్ తెలిపింది.
ప్రపంచ వృద్ధి 3.1 శాతమే: OECD
- ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 3.1 శాతంగా నమోదయ్యే అవకాశముందనీ, 2021లో నమోదైన 5.9 శాతం కంటే ఇది చాలా తక్కువని OECD తెలిపింది.
- 2023లో వృద్ధి రేటు 2.2 శాతానికి దిగివస్తుందని తెలిపింది. అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల ప్రభావం ఇందుక్కారణమని తెలిపింది.
- 2022లో చైనా వృద్ధి రేటు 3.3 శాతంగా, 2023లో 4.6 శాతంగాను నమోదుకావచ్చు.
- ఈ ఏడాది అమెరికా వృద్ధిరేటు 2021లోని 5.9 శాతం కంటే పడిపోయి 1.8 శాతానికి దిగిరావొచ్చని వివరించింది. 2023లో 0.5%లో 2024లో 1 శాతంగా నమోదయ్యే అవకాశముందని OECD తెలిపింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్యం
- భారత్-ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం త్వరలో అమల్లోకి రానుంది.
- రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంట్ 2022 నవంబర్ 22న ఆమోదం తెలిపింది.
- భారత్ తో తమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పార్లమెంట్ ఆమోదం పొందిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ట్వీట్ చేశారు.
- ఇండియా-ఆస్ట్రేలియా Economic Cooperation & Trade Agreement (AI-ECTA) అమలుకు ముందు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి.
- ఆస్ట్రేలియా పార్లమెంట్ ఆమోదంపై భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ సంతోషం వ్యక్తం చేశారు.
- 2021-22లో భారత్ నుంచి ఆస్ట్రేలియాకు 8.3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.68 వేల కోట్లు) ఎగుమతులు జరిగాయి. ఆ దేశం నుంచి మన దేశానికి 16.75 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1,37,000 కోట్లు) దిగుమతులు నమోదయ్యాయి.
- స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రస్తుతం 21.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య విలువ వచ్చే 5 ఏళ్లలో 45-50 బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని గోయెల్ తెలిపారు.
- ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఆస్ట్రేలియా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న 100 భారతీయ ఐటీ సంస్థలకు ఏటా 200 మిలియన్ డాలర్ల దాకా ఆదా అయ్యే అవకాశముంది.
- ఈ ఒప్పందం 2023 జనవరి నుంచి అమల్లోకి రానుంది.
ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ తో పాటు ప్రతి రోజూ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఈ కింది లింక్ ద్వారా కేవలం రూ.100తో కోర్సును ఈ కింది లింక్ ద్వారా purchase చేయండి.