Sunday, February 23

23, 24 DEC CURRENT AFFAIRS QUIZ ( TS & AP)

ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు

23, 24 డిసెంబర్ కరెంట్ ఎఫైర్స్ క్విజ్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)

1. ఫిక్కీ ( ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ) ప్రెసిడెంట్ గా ఎవరు ఎంపికయ్యారు ?

2. భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు ?

3. క్యూబా ప్రధానిగా మాన్యుయల్ మర్రేరో పదవిని చేపట్టారు. (2004 నుంచి పర్యాటక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ) ఎన్నేళ్ళ తరువాత ఈ పదవిని పునురుద్దరించారు. అంతకుముందు అధ్యక్షుడు మాత్రమే ఉండేవారు ?

4. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో నింగిలోకి వెళ్ళిన బోయింగ్ కంపెనీ స్టార్ లైనర్ క్రూ క్యాప్య్సూల్ డమ్మీ అంతరిక్ష నౌక తిరిగి న్యూమెక్సికోలోని ఎడారి లోకి సురక్షితంగా ల్యాండ్ అయింది.  ఈ డమ్మీ నౌకను ఎవరి సాయంతో నిర్మించారు ?

5. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడేళ్ళల్లో నిర్మించే ఈ ప్రాజెక్టు కాస్ట్ ఎంత ?

6. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ (QR SAM) క్షిపణిని ఒడిశాలోని బాలాసోర్ లో విజయవంతంగా ప్రయోగించారు.  ఇది ఎప్పటికల్లా రక్షణ దళాలకు అందుబాటులోకి తేనున్నారు.

7. ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ విజయం సాధించారు.  ఆయనకు 50.64 శాతం ఓట్లు వచ్చాయి.  ఘనీ ఎన్నో సారి ఈ పదవిలో చేపట్టబోతున్నారు.

8. 66వ జాతీయ చలన చిత్రోత్సవ అవార్డులకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైనవి ఏవి

1) 2019 డిసెంబర్ 23న ఢిల్లీలో జరిగి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డులను ప్రదానం చేశారు

2) సామాజిక అంశాల కేటగిరీలో ఉత్తమ చిత్రంగా ఎంపికైన హిందీ చిత్రం ప్యాడ్ మ్యాన్ కు అక్షయ్ కుమార్ అవార్డు స్వీకరించారు

3) మహానటిలో అత్యుత్తమ అభినయానికి కీర్తి సురేష్ ఉత్తమ నటిగా అవార్డు స్వీకరించారు

4) ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి ఎంపికైంది. దీనికి ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ అవార్డు స్వీకరించారు

5) ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డుకు చి.ల.సౌ చిత్రం ఎంపికైంది. ఆ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు రజిత కమలం అందింది.

9. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా – కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది.  ఆ కూటమి 46 స్థానాలతో అధికారం చేపట్టబోతోంది. అయితే జార్ఖండ్ లో  మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని ?

10. తెలంగాణకి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో సరైన దానిని గుర్తించండి

ఎ) తెలంగాణ మొదటి లోకాయుక్తగా రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ చింతపట్టి వెంకటరాములు 2019 డిసెంబర్ 23 న ప్రమాణం చేశారు

బి) ఉప లోకాయుక్తగా రిటైర్డ్ జడ్జి వొలిమినేని నిరంజన్ రావు ప్రమాణం చేశారు

సి) గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ వారితో రాజ్ భవన్ లో ప్రమాణం చేయించారు

డి) తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మొదటి ఛైర్మన్ గా జస్టిస్ జి. చంద్రయ్య బాధ్యతలు స్వీకరించారు

11. కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఇంద్ర కీలాద్రి కొండపై అత్యంత వైభవంగా జరిగింది.  కొమురవెల్లి క్షేత్రం ఏ జిల్లాలో ఉంది ?