దలైలామాకు గాంధీ – మండేలా అవార్డు

 • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వ నాథ్ అరేకర్ కు మండేలా అవార్డును ఆధ్యాత్మిక గురువు దలైలామా అవార్డును అందించారు.
 • మైక్లోడ్ గంజ్ ప్రాంతంలో గాంధీ-మండేలా ఫౌండేషన్ అవార్డు ప్రదానోత్సవం జరిగింది.
 • అహింస, కారుణ్యాలతోనే ప్రపంచ శాంతి సాధ్యమనీ …. ఈ సూత్రాలు వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతిలో అంతర్భాగాలని దలైలామా అన్నారు.
 • యువత దలైలామా బోధనలను పాటించాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ కోరారు.

 

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్

 • కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా 1985 బ్యాచ్ పంజాబ్ కేడర్ రిటైర్డ్ IAS అరుణ్ గోయల్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
 • ముగ్గురు సభ్యుల ఎన్నికల సంఘంలో ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే ఉన్నారు.
 • అరుణ్ గోయల్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేశారు. ఆర్థిక, విద్యుత్తు, వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో ఎక్కువగా పనిచేశారు.
 • 2003- 04 మధ్య ఢిల్లీ ముఖ్య ఎన్నికల అధికారిగా, 2006 నుంచి 2010 వరకూ కేంద్ర ఆర్థికశాఖలోని ఆర్థిక నిఘా విభాగం అధిపతిగా గోయల్ పనిచేశారు.

నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ లో భారత్ కు 61వ స్థానం

 • అమెరికాకు చెందిన పోర్చులాన్స్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నెట్వర్క్ సంసిద్ధత సూచీ – 2022 (రెడీనెస్ ఇండెక్స్)లో భారత్ గతంకంటే 6 స్థానాలు మెరుగు పరచుకుని 61వ ర్యాంకును పొందింది.
 • దేశ మొత్తం స్కోరు 2021తో పోలిస్తే 2022లో 74 నుంచి 51.19కి చేరింది.
 • అమెరికా 3 స్కోరుతో మొదటి స్థానంలో నిలవగా సింగపూర్ (79.35), స్వీడన్ (78.91) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
 • ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో … సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా, దక్షిణ కొరియా, జపాన్ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
 • తక్కువ మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో ఉక్రెయిన్ (50 స్కోరు), ఇండోనేసియా (59 వ ర్యాంక్) తర్వాత భారత్ మూడో స్థానంలో నిలిచింది.

‘కాశీ- తమిళ సంగమం’ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

 • దేశంలో మధ్య ప్రాచీన కాలంలో సాంస్కృతిక కేంద్రాలుగా తమిళనాడు, కాశీలు గుర్తింపు పొందాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోడి.
 • ఈ రెండు ప్రాంతాల మధ్య సంబంధాలను పునరుద్ధరించే లక్ష్యంతో…. వారణాసిలో నెల రోజుల పాటు జరిగే ‘కాశీ-తమిళ సంగమం’ కార్యక్రమాన్ని ప్రధాని 2022 నవంబర్ 19న ప్రారంభించారు.
 • రెండు ప్రాంతాలకు సంగీత, సాహిత్య, కళారంగాల్లో పేరుందనీ… కాశీలో బనారస్ చీరలు లభిస్తాయి. తమిళనాడు కంచి సిల్క్ కి ప్రఖ్యాతి.
 • రెండు ప్రాంతాలు దేశంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తలు, ఆచార్యులకు జన్మభూమి, కర్మభూమి. కాశీ, భక్తుడు తులసీదాస్ పుట్టినగడ్డ, తమిళనాడు.. సంత్ తిరువళ్ వర్ భక్త భూమి. జీవితంలోని అన్ని రంగాలు, అన్నిమోక్షానికి దారి తీసే ఏడు పుణ్య క్షేత్రాలైన సప్తపురిలకు కాశీ, కంచిలు ప్రసిద్ధి చెందాయన్నారు.
 • సప్తపురిల్లో అయోధ్య, మధుర, మాయ (మాయాపురి, హరిద్వార్), కాశీ(వారణాసి), కంచి(కాంచీపురం), అవంతిక (ఉజ్జయిని), ద్వారవతి (ద్వారక) ముఖ్యమైనవని అన్నారు ప్రధాని
 • ఐఐటీ మద్రాస్, బనారస్ హిందూ యూనివర్సిటీలు కాశీ-తమిళ సంగమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

అరుణాచల్ ప్రదేశ్ లో అభివృద్ధి పనులు ప్రారంభించిన మోడీ

 • అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో కొత్తగా నిర్మించిన డోని పోలో విమానాశ్రయాన్ని 2022 నవంబర్ 19న ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.
 • పశ్చిమ కామెంగ్ జిల్లాలో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన కామెంగ్ జలవిద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు

ఏడాది పాటు కరెంట్ ఎఫైర్స్ తో పాటు ప్రతి రోజూ పేపర్ క్లిప్పింగ్స్ కోసం ఈ కింది లింక్ ద్వారా కేవలం రూ.100తో కోర్సును ఈ కింది లింక్ ద్వారా purchase చేయండి.

https://atvqp.courses.store/114635?utm_source%3Dwhatsapp%26utm_medium%3Dtutor-course-referral-wa%26utm_campaign%3Dcourse-overview-app

Leave a Reply